Sreeleela – Janhvi Kapoor: బాలీవుడ్ ఆడియెన్స్ ఎదురు చూసే క్రేజీ సీక్వెల్స్‌లో ‘దోస్తానా 2’ ఒకటి. సినిమా రిలీజై 17 ఏళ్లు అవుతుంది. దోస్తానా చిత్రంలో జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా ప్రధాన తారాగణంగా నటించారు. సినిమా బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. చాలా రోజుల నుంచి ఈ సీక్వెల్ రూపొందనుందనే వార్తలు వింటూనే ఉన్నాం. ఒకానొక దశలో కత్రినా కైఫ్ పేరు కూడా బలంగా వినిపించింది. కానీ ప్రాజెక్ట్ ఎందుకో ట్రాక్ ఎక్కలేదు. ఎట్టకేలకు ఇప్పుడు రంగం సిద్ధమవుతోంది. రీసెంట్ టైమ్‌లో కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య, అభిషేక్ బెనర్జీలతో దోస్తానా 2ను తెరకెక్కించాలని కరణ్ జోహార్ భావించారు. అయితే ఏమైందో ఏమో కానీ.. ప్రాజెక్ట్ ఆగిపోయింది.
కానీ ఇప్పుడు మళ్లీ ‘దోస్తానా 2’కి రంగం సిద్ధమవుతోంది. బాలీవుడ్ సమాచారం మేరకు కార్తీక్ ఆర్యన్ స్థానంలో విక్రాంత్ మెస్సే నటించబోతున్నారు. అలాగే జాన్వీ కపూర్ స్థానంలో శ్రీలీల నటిస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. పుష్ప 2లో కిసిక్ సాంగ్‌తో ఇటు సౌత్‌లోనే కాదు.. నార్త్‌లోనూ ఈ అమ్మడుకి మంచి క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకునే మేకర్స్ ఈ సీక్వెల్‌లో తీసుకోవటానికి సిద్ధమయ్యారు.
Also Read – Mana Shankaravaraprasadgaru: ఫస్ట్ సింగిల్ వచ్చేసింది..
‘దోస్తానా 2’ సినిమాకు దర్శకుడు కూడా మారారు. కోవిడ్‌కు ముందే సీక్వెల్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. నెల రోజుల చిత్రీకరణ తర్వాత ఎందుకనో సినిమాను మేకర్స్ ఆపేసినట్లు.. అందుకు రీజన్ కూడా ఇప్పటి వరకు తనకు తెలియదని జాన్వీ కపూర్ చెప్పటం ఇక్కడ కొసమెరుపు. ఇప్పుడు ధర్మ ప్రొడక్షన్స్‌లో విక్రాంత్ మెస్సే ఎంట్రీ ఇచ్చేశాడు. ఈ బ్యానర్‌లో తను చేస్తోన్న తొలి సినిమా ఇది. యూరప్‌లో ఎక్కువ భాగం చిత్రీకరణ జరగనుంది.
ఇప్పటికే బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా మారుతున్న యంగ్ బ్యూటీ శ్రీలీల, తన సౌత్ ఇమేజ్‌కు భిన్నంగా హిందీ చిత్రసీమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించాలనే టార్గెట్‌తో పక్కా ప్లానింగ్‌తో ముందుకెళ్తోంది. సౌత్‌లో ఓ ఎనర్జిటిక్ డాన్సర్‌గా, కమర్షియల్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీలీల, బాలీవుడ్‌లో మాత్రం కేవలం గ్లామర్‌కు మాత్రమే పరిమితం కాకుండా, నటిగా నిలిచిపోయేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందుకే, ఆమె మొదటి హిందీ చిత్రం కోసం ఒక ఎమోషనల్ రొమాంటిక్ డ్రామాని సెలక్ట్ చేసుకుంది. ఇప్పుడు యూత్‌కు కనెక్ట్ అయ్యే దోస్తానా 2 వంటి సబ్జెక్ట్‌ను సెలక్ట్ చేసుకుంది. మొత్తానికి జాన్వీ కపూర్‌ని రీప్లేస్ చేస్తోన్న శ్రీలీల మెల్లగా బాలీవుడ్‌లోనూ పాగా వేయటానికి రంగం సిద్ధం చేసుకుంటోంది.
Also Read – Idli Kottu: ఇదేంటి ధనుష్ ఇలాగైంది.. ‘ఇడ్లీ కొట్టు’ ఎవడూ పట్టించుకోవటం లేదా!


