Junior Movie: శ్రీలీల హీరోయిన్‌గా నటించిన జూనియర్ మూవీ ఓటీటీలోకి వస్తోంది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా నటించాడు. బొమ్మరిల్లు ఫేమ్ జెనీలియా లాంగ్ గ్యాప్ తర్వాత జూనియర్ మూవీతో సౌత్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. రాధాకృష్ణారెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
రెండు నెలలైనా…
థియేటర్లలో విడుదలై రెండు నెలలు అయినా జూనియర్ మూవీ ఇప్పటివరకు ఓటీటీలోకి రాలేదు. తాజాగా జూనియర్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని ఓటీటీ ప్లాట్‌ఫామ్ అఫీషియల్‌గా ప్రకటించింది. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకుంది. రిలీజ్ డేట్‌ను మాత్రం రివీల్ చేయలేదు. దసరా కానుకగా అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో జూనియర్ ఓటీటీలోకి రానున్నట్లు చెబుతున్నారు.
ఓపెనింగ్స్ బాగున్నా…
జూనియర్ ప్రమోషన్స్‌లో రాజమౌళి, శివరాజ్‌కుమార్ వంటి స్టార్స్ పాల్గొనడంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చిన లాంగ్ రన్‌లో థియేటర్లలో ఈ మూవీ నిలబడలేకపోయింది. దాదాపు 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన జూనియర్ పదిహేను కోట్లలోపే కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. నిర్మాతలకు నష్టాలను తెచ్చిపెట్టింది.
Also Read – Viral Video: వామ్మో బుడ్డోడు ఇలా ఉన్నాడేంట్రా.. రెండు చేతుల్లో పాములు పట్టుకుని హల్చల్
వైరల్ వయ్యారి పాట…
రొటీన్ కమర్షియల్ స్టోరీతో దర్శకుడు రాధాకృష్ణ జూనియర్ మూవీని రూపొందించారు. కథ, స్క్రీన్‌ప్లే విషయంలో విమర్శలొచ్చిన యాక్టింగ్, డ్యాన్సులతో హీరో కిరిటీ ఆకట్టుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కారణంగా జూనియర్ మూవీకి తెలుగులో మంచి బజ్ ఏర్పడింది. వైరల్ వయ్యారి సాంగ్ పాపులర్ అయ్యింది. ఈ పాటలో కిరీటి, శ్రీలీల స్టెప్పులతో అదరగొట్టారు. జూనియర్ మూవీకి బాహుబలి ఫేమ్ సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేశారు. సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మించారు.
జూనియర్ కథ ఏంటంటే?
అభి (కిరీటి) జీవితాన్ని సరదాగా గడపాలనే మనస్తత్వం ఉన్న కుర్రాడు. స్ఫూర్తి (శ్రీలీల) అనే అమ్మాయిని ఇష్టపడతాడు. స్ఫూర్తి ప్రేమ కోసం ఆమె పనిచేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం సంపాదిస్తాడు. కంపెనీ బాస్ విజయ సౌజన్య (జెనీలియా) అనుక్షణం అభిని ద్వేషిస్తుంది. ఆమెకు అభికి ఉన్న సంబంధం ఏమిటి? విజయ సౌజన్యతో కలిసి అభి విజయనగరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అన్నదే ఈ మూవీ కథ.
Also Read – PM Narendra Modi Biopic : టైటిల్ ‘మా వందే’..


