Junior OTT: శ్రీలీల హీరోయిన్‌గా నటించిన జూనియర్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి రావాల్సింది. ఆహా ఓటీటీలో సెప్టెంబర్ 22న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదాపడింది. సెన్సార్ చిక్కుల వల్లే ఈ మూవీ పోస్ట్‌పోన్ అయినట్లు సమాచారం. ఓటీటీ వెర్షన్ కోసం సినిమాలో కొన్ని కొత్త సీన్స్ యాడ్ చేశారట. ఓ పాటను కూడా జోడించినట్లు తెలిసింది. వాటి కారణంగానే సినిమాను రీ సెన్సార్ చేయాల్సివచ్చిందని చెబుతున్నారు. అందుకే చివరి నిమిషంలో ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పోస్ట్‌పోన్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. శ్రీలీల మూవీ ఓటీటీలోకి రాకపోవడంతో ఫ్యాన్స్ డిజపాయింట్ అయ్యారు.
కొత్త రిలీజ్ డేట్ ఇదే…
జూనియర్ కొత్త ఓటీటీ రిలీజ్ డేట్‌ను ఆహా ప్లాట్‌ఫామ్ ప్రకటించింది. సెప్టెంబర్ 30 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. జూనియర్ కన్నడ వెర్షన్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో రిలీజ్ అవుతోంది. జూనియర్ మూవీతో వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి తనయుడు కిరీటి హీరోగా పరిచయమయ్యాడు. రాధాకృష్ణరెడ్డి దర్శకత్వం వహించాడు.
Also Read- Bigg Boss Telugu 9: అప్పుడేమో రన్నరప్.. ఇప్పుడు కప్పు కోసమే.. మళ్లీ బిగ్‌బాస్‌లోకి హీరో ఎంట్రీ?
తెలుగులోనే ఎక్కువ…
శ్రీలీలకు ఉన్న క్రేజ్‌తో పాటు భారీ ప్రమోషన్స్ కారణంగా తెలుగులో జూనియర్ మూవీకి మంచి బజ్ ఏర్పడింది. కానీ కాన్సెప్ట్ ఔట్‌డేటెడ్ కావడంతో కమర్షియల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. పాటలతో పాటు టెక్నికల్‌గా సినిమా బాగుందనే టాక్ వచ్చింది. 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన జూనియర్ పదిహేను కోట్లలోపే కలెక్షన్స్‌ను దక్కించుకున్నది. కన్నడ కంటే తెలుగులోనే ఈ మూవీకి ఎక్కువగా కలెక్షన్స్ రావడం గమనార్హం. జూనియర్ మూవీకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
ఫ్లాపులతో సంబంధం లేకుండా…
జూనియర్ మూవీలో జెనీలియా ఓ కీలక పాత్రలో నటించింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ మూవీతో సౌత్‌లోకి జెనీలియా రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాను సాయికొర్రపాటి నిర్మించారు. జూనియర్ కంటే ముందు శ్రీలీల హీరోయిన్‌గా నటించిన రాబిన్‌హుడ్ కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ ఫ్లాపులతో సంబంధం లేకుండా శ్రీలీల మాత్రం ఆవకాశాల రేసులో ముందుంది. ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్‌సింగ్‌తో పాటు రవితేజతో మాస్ జాతర సినిమాలు చేస్తుంది. శివకార్తికేయన్ పరాశక్తితో తమిళంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. అలాగే ఆషికీ 3తో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది.
Also Read- National Film Awards: ఘనంగా నేషనల్ ఫిలిం అవార్డ్స్ వేడుక.. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు


