Sreeleela: శ్రీలీల కెరీర్‌లో హిట్ల కంటే ఫ్లాపులే ఎక్కువగా ఉన్నాయి. అయినా ఈ అమ్మడికి అవకాశాలకు కొదవ లేదు. తెలుగులోనే కాకుండా బాలీవుడ్, కోలీవుడ్ నుంచి భారీగానే ఆఫర్లు అందుకుంటోంది. పవన్ కళ్యాణ్, శివకార్తికేయన్, రవితేజ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేస్తోంది.
కాగా ఇటీవల కేజీఎఫ్ సినిమాటోగ్రాఫర్ భువన్ గౌడ పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు కన్నడ సినీ పరిశ్రమకు చెందిన టాప్ స్టార్స్ అందరూ అటెండ్ అయ్యారు. ఈ పెళ్లి వేడుకకు శ్రీలీల స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. భువన్ గౌడ కుటుంబసభ్యులతో చాలా క్లోజ్‌గా కనిపించింది. పెళ్లి వేడుకలో శ్రీలీల సందడి చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వెరల్ అవుతున్నాయి. భువన్ గౌడ పెళ్లికి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, హీరో యశ్ కూడా హాజరయ్యారు. ప్రశాంత్ నీల్‌తో కలిసి శ్రీలీల ఓ ఫొటో దిగింది. ఈ ఫొటో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మాస్ జాతర ప్రమోషన్స్ తో బిజీగా ఉండి కూడా భువన్ గౌడ పెళ్లి కోసం ప్రత్యేకంగా శ్రీలీల బెంగళూరు వెళ్లడం ఆసక్తికరంగా మారింది.
భువన్ గౌడతో శ్రీలీలకు ఉన్న రిలేషన్ ఏమిటన్నది నెటిజన్లలో ఆసక్తికరంగా మారింది. సినిమాల్లోకి రాకముందు నుంచి భువన్ గౌడతో శ్రీలీలకు పరిచయం ఉందట. ఇద్దరి కుటుంబాల మధ్య కూడా మంచి అనుబంధం ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు భువన్ గౌడ వల్లే శ్రీలీల హీరోయిన్ అయ్యిందట. ఈ విషయాన్ని శ్రీలీలనే స్వయంగా ఓ పాత ఇంటర్వ్యూలో చెప్పింది.
Also Read – Prabhas: సెట్స్ పైకి ప్రభాస్ ‘స్పిరిట్’ వచ్చేదెప్పుడో తెలుసా..?
భువన్ గౌడ సినిమాటోగ్రాఫర్ కాకముందు ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు. శ్రీలీల కుటుంబంతో ఉన్న స్నేహం కారణంగా ఆమె ఫొటో షూట్‌లన్నింటికి భువన్ గౌడ ఫొటోగ్రాఫర్‌గా వ్యవహరించాడట. శ్రీలీల ఫొటోలను భువన్ గౌడ సోషల్ మీడియా అకౌంట్‌లో చూసిన కన్నడ డైరెక్టర్ పీఏ అర్జున్ తాను తీస్తున్న కిస్ మూవీలో ఆమెకు హీరోయిన్‌గా అవకాశం ఇచ్చాడట. భువన్ గౌడ వల్లే తాను హీరోయిన్‌గా మారినట్లు పలుమార్లు శ్రీలీల చెప్పింది. అందుకే భువన్ గౌడ పెళ్లికి శ్రీలీల అటెండ్ అయ్యిందట.
ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న డ్రాగన్ మూవీకి కూడా సినిమాటోగ్రాఫర్‌గా భువన్ గౌడ పనిచేస్తున్నాడు. మరోవైపు శ్రీలీల హీరోయిన్‌గా నటించిన మాస్ జాతర అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహించాడు. పరాశక్తితో తమిళంలోకి, ఆషికి 3 మూవీతో బాలీవుడ్‌లోకి వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వబోతుంది శ్రీలీల.
Also Read – Baahubali – The Epic: ప్రభాస్ లేటెస్ట్ లుక్ వైరల్


