Sreeleela: ఇండస్ట్రీలో ఫ్లాపులున్న హీరోహీరోయిన్లకు డిమాండ్ తక్కువే ఉంటుంది. వారిని ఎవరూ పెద్దగా పట్టించుకోరు. వరుసగా నాలుగు ఫ్లాప్‌లు ఎదురైతే మరో అవకాశం రావడమే కష్టం. కానీ శ్రీలీల కెరీర్ మాత్రం ఇందుకు భిన్నంగా సాగుతుంది. హీరోయిన్‌గా ఇప్పటివరకు తెలుగు, కన్నడ భాషల్లో పన్నెండు సినిమాలు చేసింది. మూడు సినిమాలు మినహా మిగిలినవన్నీ డిజాస్టర్లే. అయినా శ్రీలీల కెరీర్‌కు ఢోకా లేదు. తెలుగుతో పాటు బాలీవుడ్, తమిళ భాషల్లో క్రేజీ ఆఫర్లను దక్కించుకుంటోంది. స్టార్ హీరోలతో సినిమాలు చేస్తుంది.
ఏకే 64లో…
శివకార్తికేయన్ పరాశక్తి మూవీతో ఈ ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది శ్రీలీల. ఈ మూవీలో పీరియాడికల్ రోల్‌లో కనిపించనుంది. తొలి సినిమా రిలీజ్ కాకముందే తమిళంలో శ్రీలీల మరో బంపరాఫర్ అందుకున్నట్లు సమాచారం. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత హీరో అజిత్, డైరెక్టర్ ఆధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో మరో భారీ బడ్జెట్ మూవీ రాబోతుంది. ఏకే 64 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా శ్రీలీల ఛాన్స్ దక్కించుకున్నట్లు తెలిసింది. ఏకే 64 లో హీరోయిన్‌గా సౌత్, బాలీవుడ్ టాప్ హీరోయిన్ల పేర్లను పరిశీలించిన యూనిట్ చివరకు శ్రీలీలను ఎంపికచేసినట్లు తెలిసింది. ఈ మూవీలో హీరోతో డ్యూయెట్లు, రొమాంటిక్ ట్రాక్‌లతో సాగే రోల్‌లో కాకుండా కొత్త కోణంలో శ్రీలీల పాత్ర ఉండబోతున్నట్లు సమాచారం. ఏకే 64 మూవీ ఈ ఏడాది నవంబర్‌లో సెట్స్‌పైకి రానున్నట్లు సమాచారం. 2026 ఏప్రిల్ లేదా మేలో సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.
Also Read – Varalakshmi Vratham 2025: ఇవాళే వరలక్ష్మీ వ్రతం.. వాయనం ఇచ్చేటప్పుడు ఇవి గుర్తించుకోండి..
పవన్ కళ్యాణ్ సరసన…
ప్రస్తుతం తమిళ మూవీ పరాశక్తితో పాటు తెలుగులో రెండు, బాలీవుడ్‌లో మరో సినిమా చేస్తోంది శ్రీలీల. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కలయికలో రూపొందిన మాస్ జాతర మూవీ ఆగస్ట్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో సరసన నాయికగా నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బాలీవుడ్‌లోకి ఎంట్రీ…
ఆషికి 3 మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నది శ్రీలీల. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్‌కు జోడీగా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్‌లోనే కార్తీక్ ఆర్యన్‌తో శ్రీలీల ప్రేమలో పడ్డట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు శ్రీలీల హీరోయిన్‌గా నటించిన భగవంత్ కేసరి మూవీ బెస్ట్ తెలుగు మూవీగా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఈ మూవీలో బాలకృష్ణ హీరోగా నటించాడు.
Also Read – Heroine Brother Murdered: పార్కింగ్ గొడవ.. స్టార్ హీరోయిన్ సోదరుడు దారుణ హత్య


