Sreeleela: బాలీవుడ్ సెటిలయ్యేందుకు గట్టిగానే ప్లాన్ చేస్తోంది శ్రీలీల. టాలీవుడ్ సినిమాలతో వచ్చిన నేమ్, ఫేమ్‌ను వాడుకుంటూ హిందీలో చక్కటి ఆఫర్లను దక్కించుకుంటోంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న మ్యూజికల్ లవ్‌స్టోరీ ఆషికి 3తో బాలీవుడ్‌లోకి కథానాయికగా ఎంట్రీ ఇవ్వబోతుంది శ్రీలీల. ఈ సినిమా రిలీజ్ కాకముందే మరో బంపరాఫర్ శ్రీలీలను వరించినట్లు సమాచారం. రణవీర్ సింగ్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ దక్కించుకున్నట్లు బాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది.
భారీ బడ్జెట్ మూవీ…
రణవీర్ సింగ్, బాబీ డియోల్ ప్రధాన పాత్రల్లో బాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కించబోతున్నది. ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీల కన్ఫామ్ అయినట్లు తెలిసింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రణవీర్‌సింగ్‌కు జోడీగా శ్రీలీల కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ బాలీవుడ్ మూవీకి సంబంధించి రణవీర్‌సింగ్, శ్రీలీలలపై ఇటీవలే ఓ ఫొటోషూట్‌ను చేశారట మేకర్స్. శ్రీలీలపై విడిగా కూడా లుక్ టెస్ట్‌ను నిర్వహించినట్లు సమాచారం. శ్రీలీల లుక్ విషయంలో మేకర్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నట్లు తెలిసింది.
Also Read- Junior Movie Review: ‘జూనియర్’ మూవీ రివ్యూ
పూర్తి భిన్నమైన లుక్‌లో…
ఈ బాలీవుడ్ మూవీలో హీరో హీరోయిన్ల పాత్రలు రా అండ్ రస్టిక్‌గా ఉంటాయట. ఇప్పటివరకు చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా రణవీర్‌సింగ్, శ్రీలీల కనిపిస్తారని అంటున్నారు. తన క్యారెక్టర్ కోసం శ్రీలీల మేకోవర్ అయ్యే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసింది.
లెనిన్ అందుకే వదులుకుందా..
కాగా అఖిల్ అక్కినేని లెనిన్ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా ఫిక్సైంది. ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేసిన తర్వాత ఆమె ఈ సినిమా నుంచి తప్పుకోవడం హాట్ టాపిక్‌గా మారింది. రణవీర్‌సింగ్ సినిమా కోసమే లెనిన్‌ను శ్రీలీల వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. పాటలు, రొమాన్స్‌కు పరిమతమవుతూ కొన్నాళ్లుగా శ్రీలీల చేస్తున్న కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతోన్నాయి. లెనిన్‌లో శ్రీలీలది అలాంటి రొటీన్ రోల్ అని టాక్. రణవీర్‌సింగ్ సినిమాలో అవకాశం రావడం, ఛాలెంజింగ్ రోల్ కావడంతో లెనిన్‌ను పక్కనపెట్టిన శ్రీలీల బాలీవుడ్ సినిమా కోసం బల్క్ డేట్స్ కేటాయించినట్లు చెబుతోన్నారు. రణవీర్‌సింగ్ సినిమాతో బాలీవుడ్‌లో పర్మినెంట్‌గా సెటిలవ్వాలనే ఆలోచనలో శ్రీలీల ఉన్నట్లు చెబుతోన్నారు.
Also Read- Vijay Deverakonda Hospitalized: హాస్పిటల్‌లో జాయినైన విజయ్ దేవరకొండ.. టెన్షన్‌లో ఫ్యాన్స్
మాస్ జాతర…ఉస్తాద్ భగత్ సింగ్...
శ్రీలీల హీరోయిన్‌గా నటించిన జూనియర్ మూవీ నేడు (జూలై 18న) రిలీజైంది. కిరీటి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ మూవీలో శ్రీలీల డ్యాన్సులతో అదరగొట్టింది. ప్రస్తుతం తెలుగులో రవితేజ మాస్ జాతరతో పాటు పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు చేసింది. మాస్ జాతర వినాయక చవితికి రిలీజ్ కానుంది. ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ ఇటీవలే మొదలైంది. శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తి మూవీతో ఈ ఏడాది కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది శ్రీలీల.


