Venki – Trivikram Movie: ఈ ఏడాది రిలీజైన సంక్రాంతికి వస్తున్నాం మూవీతో కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అందుకున్నారు వెంకటేష్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా మూడు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సక్సెస్‌తో జోరు మీదున్న వెంకటేష్ ఇటీవలే త్రివిక్రమ్‌తో ఓ కొత్త సినిమాను మొదలుపెట్టాడు.
ఇదే ఫస్ట్ టైమ్…
గతంలో వెంకటేష్ హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి, వాసు సినిమాలకు స్టోరీ, డైలాగ్ రైటర్‌గా పనిచేశారు త్రివిక్రమ్. వెంకటేష్ సినిమాకు త్రివిక్రమ్ డైరెక్టర్‌గా వ్యవహరించడం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. ఇటీవలే సింపుల్‌గా పూజా కార్యక్రమాలతో సినిమాను లాంఛ్ చేశారు. ఈ నెలలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టబోతున్నారు.
Also Read- Ready to Release: ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాలు ఇవే – ఘాటీకి పోటీ ఉంటుందా?
కేజీఎఫ్ హీరోయిన్…
కాగా ఈ మూవీలో వెంకటేష్ సరసన నటించే హీరోయిన్‌ను కూడా త్రివిక్రమ్ ఫైనల్ చేసేశారట. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి నాయికగా ఖరారైనట్లు సమాచారం. ఈ సినిమాలో హీరోయిన్‌గా త్రిష పేరు గట్టిగా వినిపించింది. ఆమెతో పాటు శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి, మీనాక్షి చౌదరి వంటి నాయికల పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే వారందరిని కాదని శ్రీనిధికి త్రివిక్రమ్ ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం. ఇప్పటివరకు వెంకటేష్‌తో సినిమా చేయని హీరోయిన్ అయితేనే బాగుంటుందనే ఆలోచనతో ఈ కన్నడ బ్యూటీని ఎంపికచేసినట్లు ప్రచారం జరుగుతోంది.
హిట్ 3తో ఎంట్రీ…
శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇది మూడో సినిమా. నాని బ్లాక్‌బస్టర్ మూవీ హిట్ 3తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. తొలి సినిమాతోనే బ్లాక్‌బస్టర్‌ను అందుకున్నది. ప్రస్తుతం సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న తెలుసు కదాలో ఓ నాయికగా కనిపించబోతున్నది.
టైటిల్ ఏదంటే?
వెంకటేష్, త్రివిక్రమ్ మూవీకి అలివేలు వెంకటరత్నం, వెంకటరమణ కేరాఫ్ ఆనంద నిలయం అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వెంకటేష్, త్రివిక్రమ్ గత సినిమాల తరహాలోనే ఫన్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్నట్లు చెబుతున్నారు. హారిక హాసిని క్రియేషన్స్ పతాకంపై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
చిరంజీవి హీరోగా నటిస్తున్న మన శివశంకరవరప్రసాద్‌గారు సినిమాలో వెంకటేష్ ఓ కీలక పాత్ర చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్‌లో వెంకటేష్ భాగం కాబోతున్నట్లు సమాచారం.


