Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభVenkatesh: అఫీషియ‌ల్ - వెంకీ మామ‌కు హీరోయిన్ దొరికేసింది - త్రివిక్ర‌మ్ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ

Venkatesh: అఫీషియ‌ల్ – వెంకీ మామ‌కు హీరోయిన్ దొరికేసింది – త్రివిక్ర‌మ్ సినిమాలో క‌న్న‌డ బ్యూటీ

Venkatesh: సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్‌బ‌స్ట‌ర్‌తో సినిమాల జోరును పెంచేశారు విక్ట‌రీ వెంక‌టేష్. ప్ర‌స్తుతం త్రివిక్ర‌మ్ మూవీతో పాటు చిరంజీవి మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌గారులో న‌టిస్తున్నారు వెంక‌టేష్‌. వీటితో పాటు వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో వెంక‌టేష్ ఓ సినిమాకు గ్రీన్‌సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ కాంబోలో తెర‌కెక్కుతున్న మూవీకి సంబంధించి మేక‌ర్స్ అదిరిపోయే అప్‌డేట్‌ను రివీల్ చేశారు.

- Advertisement -

ఈ సినిమాలో వెంక‌టేష్‌కు జోడీగా కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా ఛాన్స్ ద‌క్కించుకున్న‌ది. మంగ‌ళ‌వారం శ్రీనిధి శెట్టి బ‌ర్త్‌డేను పుర‌స్క‌రించుకొని ఆమె ఈ సినిమాలో నాయిక‌గా క‌నిపించ‌నున్న‌ట్లు వెల్ల‌డిస్తూ ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. తొలుత ఈ మూవీలో హీరోయిన్‌గా త్రిష‌తో పాటు నేహాశెట్టి, మీనాక్షి చౌద‌రి, శ్ర‌ద్ధా శ్రీనాథ్ తోపాటు మ‌రికొంద‌రి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. వారంద‌రిని కాద‌ని శ్రీనిధి శెట్టిని మేక‌ర్స్ ఫైన‌ల్ చేశార‌ట‌. త్వ‌ర‌లోనే వెంక‌టేష్‌, త్రివిక్ర‌మ్ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతుంది.

Also Read – Megastar Chiranjeevi: ఆగిపోయిన ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కిస్తున్న చిరంజీవి-వెంకీ!

ఇటీవ‌లే తెలుసు క‌దాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది శ్రీనిధి శెట్టి. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టించిన ఈ మూవీ దీపావ‌ళి కానుక‌గా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్న‌ది. తెలుసు క‌దా తెలుగులో శ్రీనిధి శెట్టి అంగీక‌రించిన ఫ‌స్ట్ మూవీ. కానీ మొద‌టగా నాని హిట్ 3 థియేట‌ర్ల‌లో రిలీజైంది. వెంక‌టేష్, త్రివిక్ర‌మ్ మూవీ తెలుగులో శ్రీనిధి శెట్టి చేస్తున్న మూడో సినిమా. ఈ సినిమాలో శ్రీనిధితో పాటు మ‌రో హీరోయిన్ కూడా న‌టించ‌బోతున్న‌ట్లు వార్త‌లొస్తున్నాయి.

మ‌రోవైపు త్రివిక్ర‌మ్ డైరెక్ష‌న్‌లో వెంక‌టేష్ చేస్తున్న ఫ‌స్ట్ మూవీ ఇది. గ‌తంలో వెంక‌టేష్ హీరోగా న‌టించిన నువ్వు నాకు న‌చ్చావ్‌, మ‌ల్లీశ్వ‌రి, వాసు సినిమాల‌కు స్టోరీ, డైలాగ్ రైట‌ర్‌గా ప‌నిచేశారు త్రివిక్ర‌మ్‌. ఈ సినిమాకు అబ్బాయిగారు 60 ప్ల‌స్‌, అలివేలు వెంక‌ట‌ర‌త్నం అనే టైటిల్స్ ప‌రిశీల‌న‌లో ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్రివిక్ర‌మ్ శైలిలోనే ఫ‌న్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా రూపొందుతున్న‌ట్లు చెబుతున్నారు. హారిక హాసిని క్రియేష‌న్స్ ప‌తాకంపై చిన‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ ఫేమ్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్ మ్యూజిక్ అందిస్తున్నారు.

చిరంజీవి హీరోగా న‌టిస్తున్న‌ మ‌న శంక‌ర‌వ‌ర‌ప్ర‌సాద్‌గారు సినిమాలో వెంక‌టేష్ ఓ కీల‌క పాత్ర చేస్తున్నారు. మంగ‌ళ‌వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌లో వెంక‌టేష్ జాయిన్ అయ్యారు. న‌వంబ‌ర్ వ‌ర‌కు ఈ షెడ్యూల్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌న శంక‌రవ‌రప్ర‌సాద్‌గారు వెంక‌టేష్ క్యారెక్ట‌ర్ 30 నిమిషాల వ‌ర‌కు క‌నిపించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read – Aisha Sharma: ఎద అందాలతో ఊచకోత

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad