Sriya Reddy: కొంతమందికి టాలెంట్ ఉన్నా, అవకాశాలు వచ్చినా మనసుకు నచ్చిన సినిమాలనే ఒప్పుకుంటుంటారు. చేసిన సినిమాలు చాలా తక్కువగా ఉన్నా, వాటిలో పాత్రలు జీవిత కాలం గుర్తుండిపోవాలనే సంకల్పంతో ఏది పడితే అది ఒప్పుకొని అందరిలో ఒకరిగా మిగలరు. అందరిలో ఒక్కరిగానే పాపులారిటీని కోరుకుంటారు. అలా కథ, అందులో తన పాత్రకి, నటించే అవకాశం ఉన్నప్పుడే ఒప్పుకుంటుంటారు. అలాంటి నటీమణులు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలాంటి వారిని వేళ్ళ మీద లెక్కపెట్టొచ్చు. ఆ రేర్ లిస్ట్ లో శ్రియ రెడ్డి ఒకరు.
విక్రమ్ హీరోగా నటించిన సమురాయ్ సినిమాతో నటిగా తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత తెలుగులో అప్పుడప్పుడు అనే సినిమాను చేశారు. కొంతకాలం తర్వాత అమ్మ చెప్పింది అనే సినిమాలో నటించారు. మొత్తంగా తెలుగులో చేసిన సినిమాలు చాలా తక్కువ. ఆమాటకొస్తే ఇతర భాషల్లోనూ శ్రియ రెడ్డి చేసిన సినిమాలు చాలా అంటే చాలా తక్కువే. తిప్పికొడితే కనీసం 15 సినిమాలు ఉంటాయి. వీటిలో కాస్త ఎక్కువ చేసిన సినిమాలు తమిళంలోనే.
Also Read – Vishaka tragedy: వేడి గంజి పడి చిన్నారులు గాయపడ్డ ఘటనపై సీఎం చంద్రబాబు ఆవేదన..!
అయితే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీలో ఓ పవర్‌ఫుల్ రోల్ చేశారు శ్రియ రెడ్డి. ఈ పాత్రకి మంచి పేరే వచ్చింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఓజీలో సాలీడ్ పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ఈ కథ వినగానే ఒప్పుకున్నట్టుగా ఆమె ఇదివరకే చెప్పారు. శ్రియరెడ్డి పర్ఫార్మెన్స్ కి ఏకంగా పవన్ కళ్యాణ్ పొగడ్తల వర్షం కురిపించడం ఆసక్తికరం. పవన్ సినిమాలో నటించిన తర్వాత చాలామందికి కెరీర్ ఊపందుకుంటుంది. ఇప్పుడు, శ్రియ రెడ్డికి అలాంటి ఊపు మొదలవబోతుందని చెప్పుకుంటున్నారు.
శ్రియ రెడ్డి తెలుగులో సలార్, ఓజీ సినిమాలలో పాత్రలు బాగా ఎలివేట్ అయ్యాయి. సీక్వెల్స్ లో కూడా ఆమెకి ఛాన్స్ ఉందని సమాచారం. కొత్త సినిమాలు అవసరం లేదు. సలార్ 2, ఓజీ 2 గనక రూపొందితే వాటిలో గ్యారెంటీగా శ్రియ పాత్రని ఇంకా ఎలివేట్ చేసే స్కోప్ ఉంది. చూడాలి మరి మన దర్శకులు సీక్వెల్స్ లో ఆమె పాత్రను ఎలా కొనసాగిస్తారో. ఇలాంటి టాలెంటెడ్ యాక్ట్రెస్ కి గోపీచంద్ మలినేని, బాబి, కొరటాల శివ, రాజమౌళి లాంటి వారు గనక కొత్త తరహాలో పవర్ ఫుల్ రోల్స్ రాస్తే ఆమె కెరీర్ నిజంగా నెస్క్ట్ లెవల్ లో ఉంటుందనడంలో సందేహమే లేదు. కాకపోతే, ఆ సినిమాలను శ్రీయా రెడ్డి ఒప్పుకోవాలి.
Also Read – Sobhita: ఇండియన్ అంకుల్‌తో తనని పోల్చుకున్న అక్కినేని కోడలు.. ఎందుకంటే.??


