Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSS Rajamouli Birthday: మట్టిలోంచి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన మాంత్రికుడు!

SS Rajamouli Birthday: మట్టిలోంచి మహా సామ్రాజ్యాన్ని నిర్మించిన మాంత్రికుడు!

SS RAJAMOULI: ఎస్.ఎస్. రాజమౌళి… ఈ పేరు వింటే ఒక సినిమా గుర్తొస్తుంది. బాహుబలి! ఇది ఒక సినిమా కాదు, తెలుగు సినిమా సత్తా ఏంటో ప్రపంచానికి చూపించిన ఒక బ్రాండ్! అపజయం అంటూ ఎరుగని ఒకే ఒక్క డైరెక్టర్. ఆయన తీసేది సినిమా కాదు, విజువల్ వండర్.

- Advertisement -

ఆయన తండ్రి, కథా రచయిత కె.వి. విజయేంద్ర ప్రసాద్ గారి నుంచి కథలు చెప్పే నైపుణ్యాన్ని అందుకున్నాడు. ఆయనది చిన్నప్పటి నుంచే సినిమా పిచ్చి. కానీ, మొదట్లో టీవీ సీరియల్స్‌కి అసిస్టెంట్ డైరెక్టర్‌గా, చిన్న చిన్న ప్రాజెక్టులతోనే మెరుగులు దిద్దుకున్నాడు. కొత్తగా నేర్చుకోవాలన్న ఆకలితో ఆయన వేసిన ప్రతి అడుగూ నేడు ఆయన విజయానికి పునాది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ntr-prashanth-neel-dragon-movie-postponed-once-again/

డెబ్యూ టు దర్శకధీరుడు:

‘స్టూడెంట్ నెం.1’తో ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత ‘సింహాద్రి’తో జూనియర్ ఎన్టీఆర్ స్టార్‌డమ్‌ను ఎక్కడికో తీసుకెళ్లి.. తానేంటో నిరూపించుకున్నాడు.
‘ఛత్రపతి’, ‘విక్రమార్కుడు’, ‘యమదొంగ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్లతో తెలుగు ఇండస్ట్రీకి “ఎదురులేని దర్శకుడు”గా మారిపోయాడు.
‘మగధీర’తో విజువల్స్, గ్రాండియర్‌ అంటే ఏంటో చూపించి, తెలుగు సినిమాను ‘పాన్ ఇండియా’ అనే మాట వినకముందే ఆ స్థాయికి తీసుకెళ్లాడు. ఆ తర్వాత ‘ఈగ’తో కేవలం ఒక చిన్న ఈగతో కూడా సంచలనం సృష్టించగలనని నిరూపించాడు.

బాహుబలి :

ఇదొక సినిమా కాదు. తెలుగు జాతి గర్వించదగ్గ మహా సామ్రాజ్యం తెలుగు సినిమాను 1000 కోట్ల క్లబ్‌లోకి తీసుకెళ్లి, ‘ఇండియన్ సినిమా’ అంటే ‘బాహుబలి’ అనేలా చేశాడు. ప్రపంచ పటంలో మన సినిమాకు ఒక స్థానాన్ని కల్పించింది ఈ సిరీస్. నాన్-బాహుబలి రికార్డులు అంటూ మిగతా సినిమాలు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చాడు.

‘RRR’తో ప్రపంచ సినీ చరిత్రలోనే సంచలనం సృష్టించాడు. కేవలం కలెక్షన్లే కాదు, అమెరికన్ ఆడియన్స్‌ని, హాలీవుడ్ క్రిటిక్స్‌ని సైతం తనవైపు తిప్పుకున్నాడు. “నాటు నాటు” పాట ఆస్కార్ గెలిచి, భారతీయ సినిమా పేరును అగ్రస్థానంలో నిలబెట్టింది. రాజమౌళి అనే పేరు ఇప్పుడు దేశాల హద్దులను చెరిపేసి, గ్లోబల్ ఫిల్మ్ మేకర్గా చరిత్ర సృష్టించింది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-surprises-fans-on-his-birthday-with-spirit-update/

ప్రస్తుతం ఆయన దృష్టి అంతా తన డ్రీమ్ ప్రాజెక్టులపైన ఉంది.
SSMB29 సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి చేస్తున్న గ్లోబల్ అడ్వెంచర్ సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురుచూస్తోంది. హాలీవుడ్ స్థాయికి మించిన యాక్షన్ అడ్వెంచర్‌గా ఇది రూ. 1000 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతుందని అంచనా.
మహాభారతం: ఇది రాజమౌళి గారి ‘డ్రీమ్ ప్రాజెక్ట్’. భారతీయ ఇతిహాసంలో మహాభారతం గురించి ప్రపంచమంతా మాట్లాడుకునేలా ఒక సినిమాటిక్ వండర్ సృష్టించాలని ఆయన లక్ష్యం.

రాజమౌళి గారి క్రియేటివిటీ, పక్కా ప్లానింగ్.. ఈ లక్షణాలే ఆయనను దర్శకధీరుడు నిలబెట్టాయి.
ఆయన మరింత గొప్ప విజయాలు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.

(అక్టోబర్ 10 రాజమౌళి పుట్టినరోజు సందర్భంగా)

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad