Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSSMB29: ఎస్ఎస్ఎంబీ29 అప్‌డేట్ - క్లైమాక్స్‌ షూట్‌లో మ‌హేష్ మూవీ - గుడ్‌న్యూస్ చెప్పిన జ‌క్క‌న్న‌

SSMB29: ఎస్ఎస్ఎంబీ29 అప్‌డేట్ – క్లైమాక్స్‌ షూట్‌లో మ‌హేష్ మూవీ – గుడ్‌న్యూస్ చెప్పిన జ‌క్క‌న్న‌

SSMB29: మ‌హేష్‌బాబు గ్లోబ్‌ట్రాట‌ర్ అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్న అభిమానుల‌కు రాజ‌మౌళి స‌డెన్‌ స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు. ఎస్ఎస్ఎంబీ29 నుంచి పృథ్వీరాజ్ సుకుమార‌న్ ఫ‌స్ట్‌లుక్‌ను శుక్ర‌వారం (నేడు) రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ షూటింగ్‌పై అప్‌డేట్‌ను ట్విట్ట‌ర్ ద్వారా రాజ‌మౌళి రివీల్ చేశారు.

- Advertisement -

మ‌హేష్‌బాబు, పృథ్వీరాజ్ సుకుమార‌న్‌, ప్రియాంక‌చోప్రాల‌పై క్లైమాక్స్ షూట్ జ‌రుగుతోన్న‌ట్లు వెల్ల‌డించారు. ఓ వైపు క్లైమాక్స్ షూట్‌.. మ‌రోవైపు గ్లోబ్‌ట్రాట‌ర్ ఈవెంట్ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఇంత‌కుముందెన్న‌డూ చూడ‌ని విధంగా ఈ ఈవెంట్ ఉండ‌బోతుంది. న‌వంబ‌ర్ 15 కోసం నేను మీ అంద‌రితో పాటు నేను ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ వార‌మంతా హుషారుగా ఉండేందుకు నేడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ లుక్‌ను విడుద‌ల చేయ‌బోతున్నాం అని రాజ‌మౌళి ట్వీట్ చేశారు. జ‌క్క‌న్న ట్వీట్‌తో అభిమానులు ఖుషి అవుతోన్నారు. ఈ యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ మూవీలో పృథ్వీరాజ్ సుకుమార‌న్ విల‌న్‌గా న‌టించ‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read- Sankranthi 2026: జ‌న‌నాయ‌గ‌న్ వ‌ర్సెస్ రాజాసాబ్ – ర‌స‌వ‌త్త‌రంగా మారిన సంక్రాంతి పోరు

గ్లోబ్‌ట్రాట‌ర్ మూవీకి వార‌ణాసి అనే టైటిల్‌ను క‌న్ఫామ్ చేసిన‌ట్లు స‌మాచారం. న‌వంబ‌ర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్ లాంఛ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ ఈవెంట్‌లో మూడు నిమిషాల నిడివితో కూడిన ఓ వీడియో ద్వారా మ‌హేష్ లుక్‌తో పాటు టైటిల్‌ను వెల్ల‌డించ‌నున్నార‌ట‌. ఈ ఈవెంట్‌తోనే ఎస్ఎస్ఎంబీ 29 ప్ర‌మోష‌న్స్‌ను అఫీషియ‌ల్‌గా మొద‌లుకాబోతున్నాయి. ఈ ఈవెంట్ జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది. లైవ్ స్ట్రీమింగ్ హ‌క్కులను ఫ్యాన్సీ రేటుకు జియో హాట్‌స్టార్ ద‌క్కించుకున్న‌ట్లు స‌మాచారం.

గ్లోబ్‌ట్రాట‌ర్ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతుంది. దాదాపు వెయ్యి కోట్ల బ‌డ్జెట్‌తో మ‌హేష్‌బాబు, రాజ‌మౌళి మూవీ రూపొంద‌నున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎస్ఎస్ఎంబీ29 మూవీతో పాన్ వ‌ర‌ల్డ్ లీగ్‌లోకి మ‌హేష్‌బాబు ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. భార‌తీయ భాష‌ల‌తో పాటు ఫారిన్ లాంగ్వేజెస్‌లో విడుద‌ల‌కాబోతుంది. 2027లో ఈ సినిమా విడుద‌ల‌కాబోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.

Also Read- Chinmayi Sripada: చిన్మ‌యిపై అస‌భ్య‌క‌ర కామెంట్స్ – సీపీ స‌జ్జ‌నార్‌కు కంప్లైంట్ ఇచ్చిన‌ సింగ‌ర్‌

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad