Directors: సినిమాకు మూలం దర్శకుడే. డైరెక్టర్ ఆలోచనలు, ఊహల నుంచే సినిమాలు ఆవిష్కృతమవుతాయి. సినిమా జయాపజయాలు దర్శకుడి చేతుల్లోనే ఉంటాయి. సినిమా హిట్టయితే హీరో తర్వాత దర్శకుడికే ఎక్కువగా పేరు వస్తుంది. అదే ఫ్లాప్ అయితే హీరో కంటే ఎక్కువగా దర్శకుడిపైనే విమర్శలు వస్తుంటాయి. ఇండస్ట్రీలో సక్సెస్లుల్లో ఉన్న డైరెక్టర్‌కే ఎక్కువగా వాల్యూ ఉంటుంది. అతడితోనే సినిమాలు చేసేందుకు స్టార్స్ ఎదురుచూస్తుంటారు. ఒక్క ఫ్లాప్ ఎదురైతే నెక్స్ట్ మూవీ కోసం దర్శకుడు ఎదురుచూడాల్సిందే. ఫ్లాప్‌లు లేని డైరెక్టర్లు కనిపించడం చాలా అరుదు. కానీ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోని కొందరు దర్శకులు మాత్రం ఒక్క ఫ్లాప్ లేకుండా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఆ దర్శకులు ఎవరంటే?
రాజమౌళి టాప్…
ఫ్లాప్‌లు లేని డైరెక్టర్స్ లిస్ట్‌లో ఫస్ట్ ప్లేస్ ఎస్.ఎస్.రాజమౌళిదే. స్టూడెంట్ నంబర్ వన్‌తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు రాజమౌళి. ఇప్పటివరకు 12 సినిమాలు చేశారు. అందులో ఒక్క సినిమా కూడా ఫ్లాపవ్వలేదు. రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్‌ను గెలుచుకుంది. ఈ ఘనతను సాధించిన ఫస్ట్ ఇండియన్ డైరెక్టర్‌గా రాజమౌళి చరిత్రను తిరగరాశాడు. బాహుబలి, బాహుబలి 2, మగధీర, ఛత్రపతి ఇలా… రాజమౌళి రూపొందించిన అన్ని సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్ కావడం గమనార్హం. కమెడియన్ సునీల్‌తో తెరకెక్కించిన మర్యాద రామన్న కూడా కమర్షియల్‌గా పెద్ద హిట్‌గా నిలిచింది.
Also Read – Mumbai Train Attack: ముంబై రైలు పేలుళ్ల ఘటనలో హైకోర్టు సంచలన తీర్పు!
లోకేష్ కనగరాజ్…
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కెరీర్‌లో ఐదు సినిమాలు చేశాడు. డెబ్యూ మూవీ మా నగరం నుంచి లియో వరకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన సినిమాలన్నీ ప్రేక్షకులను మెప్పించాయి. లియో, విక్రమ్ సినిమాలు కోలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశాయి. ప్రస్తుతం రజనీకాంత్‌తో కూలీ మూవీ చేస్తున్నాడు లోకేష్ కనగరాజ్. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీపై పాన్ ఇండియన్ లెవెల్‌లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. కూలీలో టాలీవుడ్ స్టార్ నాగార్జున విలన్‌గా నటిస్తుండగా… ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.
అట్లీ….ఐదు హిట్లే…
కోలీవుడ్‌లో లోకేష్ కనగరాజ్‌తో పాటు ఫ్లాపే లేని డైరెక్టర్‌గా కొనసాగుతోన్నాడు అట్లీ. రాజారాణితో కోలీవుడ్‌లోకి దర్శకుడిగా అరంగేట్రం చేసిన అట్లీ దళపతి విజయ్‌తో వరుసగా మూడు సినిమాలు చేసి విజయాలను దక్కించుకున్నాడు. షారుఖ్‌ఖాన్ జవాన్‌తో డైరెక్టర్‌గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. జవాన్ మూవీ ఏకంగా 1150 కోట్ల వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ఓ భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నాడు అట్లీ. సైంటిఫిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
కేజీఎఫ్ డైరెక్టర్…
ప్రశాంత్ నీల్ ఇప్పటివరకు డైరెక్టర్‌గా నాలుగు సినిమాలు చేశాడు. ఉగ్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్‌తో స్టార్ డైరెక్టర్‌గా మారాడు. కేజీఎఫ్ సిరీస్ మూవీస్ ఇండియన్ సినిమా హిస్టరీలోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాలుగా నిలిచాయి. ప్రభాస్ సలార్‌తో టాలీవుడ్‌లో తొలి అడుగులోనే తనదైన మార్కు వేశాడు. ఉగ్రం రీమేక్‌గా తెరకెక్కిన సలార్ మూవీ 700కోట్ల వసూళ్లను రాబట్టింది. నాలుగు సినిమాలతో అపజయమే లేని దర్శకుడిగా నిలిచిన ప్రశాంత్ నీల్… రైటర్‌గా మాత్రం భగీరతో ఫ్లాప్ మూటగట్టుకున్నాడు.
వంద శాతం సక్సెస్ రేట్…
బాలీవుడ్ రాజ్ కుమార్ హిరాణీ వంద శాతం సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్‌గా కొనసాగుతోన్నాడు. కెరీర్‌లో ఇప్పటివరకు రాజ్‌కుమార్ హిరాణీ ఆరు సినిమాలు చేయగా… అన్నిబ్లాక్‌బస్టర్స్ కావడం గమనార్హం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్‌లో నాగ్ అశ్విన్ కూడా ఉన్నాడు. డైరెక్టర్‌గా నాగ్ అశ్విన్ చేసిన ఎవడే సుబ్రహ్మణ్యం, కల్కి రెండు పెద్ద హిట్స్‌గా నిలిచాయి.


