Richest Indian Directors: సినిమాకు కర్త, కర్మ క్రియ దర్శకుడే. డైరెక్టర్ ఊహలు, ఆలోచనల నుంచే సినిమా పడుతుంది. సినిమా జయాపజయాలు ఎక్కువగా దర్శకుడిపైనే ఆధారపడి ఉంటాయి. యాక్టర్లను స్టార్లుగా మార్చేది దర్శకులే. అందుకే డైరెక్టర్‌ను కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఉంటుంటారు. తెర వెనుక ఉండి సినిమాను నడిపించే అసలు సిసలైన హీరో డైరెక్టర‌్‌కే. దర్శకులకు హీరోలతో సమానంగా క్రేజ్ ఉంటుంది. పాన్ ఇండియన్ కల్చర్‌తో ఫేమ్ మాత్రమే కాదు దర్శకుల రెమ్యూనరేషన్లు భారీగానే పెరిగాయి.
200 కోట్లు…
టాప్ డైరెక్టర్లు కొందరు అగ్ర హీరోలతో సమానంగా రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి ఒక్కో సినిమాకు రెండు వందల కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నాడు. ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్‌తో పాటు పలువురు స్టార్ డైరెక్టర్ల రెమ్యూనరేషన్లు యాభై కోట్లకుపైనే ఉన్నాయి. బాలీవుడ్‌లో దర్శకులకు సైతం ఒక్కో సినిమాకు యాభై నుంచి వంద కోట్ల మధ్యలో రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు.
కరణ్ జోహార్ టాప్…
రెమ్యూనరేషన్లలోనే కాదు కొందరి దర్శకుల ఆస్తుల విషయంలో ఇతరులకు సైతం అందనంత ఎత్తులో ఉన్నారు. స్టార్ హీరోలకు మించి సంపాదిస్తున్నారు. ఇండియాలోనే టాప్ టెన్ రిచెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో కరణ్ జోహార్ ఫస్ట్ ప్లేస్‌లో ఉన్నాడు. ఈ బాలీవుడ్ దర్శకనిర్మాతలు ఆస్తులు మొత్తం విలువ 1500 కోట్లకుపైనే కావడం గమనార్హం. సెకండ్ ప్లేస్‌లో 1300 కోట్లతో త్రీ ఇడియట్స్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరానీ ఉన్నారు.
Also Read – GST Rate Cut : రికార్డు సృష్టించిన డిజిటల్ పేమెంట్స్..ఒక్కరోజులో రూ.11 లక్షల కోట్లు
రాజమౌళి టాప్ త్రీ…
రిచెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో టాలీవుడ్ డైరెక్టర్ రాజమౌళి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. జక్కన్న ఆస్తుల మొత్తం కలిపి 1000 కోట్లకుపైనే ఉంటాయని టాక్. రాజమౌళి మినహా ఈ లిస్ట్‌లో దక్షిణాది నుంచి ఒక్క డైరెక్టర్ కూడా లేకపోవడం గమనార్హం. 940 కోట్లతో రాజమౌళి తర్వాత సంజయ్ లీలా భన్సాలీ నిలిచాడు.
అందరూ బాలీవుడ్ డైరెక్టర్లే…
అత్యంత ధనవంతులైన దర్శకుల జాబితాలో అనురాగ్ కశ్యప్ ఐదో ప్లేస్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే యాక్టర్‌గా టర్న్ అయిన ఈ డైరెక్టర్ మొత్తం సంపాదన 850 కోట్ల వరకు ఉంటుందట. ఆ తర్వాతి స్థానాల్లో మేఘన గుల్జార్ (830 కోట్లు), రాకేష్ రోషన్ (700 కోట్లు), కబీర్ ఖాన్ (400 కోట్లు), ఫర్షాన్ అక్తర్ (350 కోట్లు), జోయా అక్తర్ (300 కోట్ల) కొనసాగుతున్నారు.
మహేష్‌బాబుతో…
దక్షిణాది నుంచి రిచెస్ట్ డైరెక్టర్స్ లిస్ట్‌లో చోటు దక్కించుకున్న రాజమౌళి ప్రస్తుతం మహేష్‌బాబుతో యాక్షన్ అడ్వెంచర్ మూవీ చేస్తున్నాడు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ మూవీలో ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తోంది. పలువురు భారతీయ స్టార్స్‌తో పాటు హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు.
Also Read – Dussehra Holidays 2025: ఇంటర్మీడియట్ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. రేపటి నుంచే దసరా సెలవులు


