Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSS Thaman: లక్కీ డేట్ సెంటిమెంట్.. ది రాజాసాబ్‌కి కలిసొస్తుందా?

SS Thaman: లక్కీ డేట్ సెంటిమెంట్.. ది రాజాసాబ్‌కి కలిసొస్తుందా?

SS Thaman: సినిమా ఇండస్ట్రీలో ఒక్కొక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఆ డేట్ ప్రకారం తమ సినిమాలను రిలీజ్ చేస్తే బాక్సాఫీస్ వద్ద విజయం పక్కా అని నమ్ముతుంటారు. ఈ నమ్మకాన్ని హీరోలు, దర్శక నిర్మాతలే కాదు.. కొన్నిసార్లు సంగీత దర్శకులు, హీరోయిన్స్ కూడా నమ్ముతుంటారు. అలా, లక్కీ డేట్ గురించి ఇప్పుడు మ్యూజిక్ సెన్షేషన్ ఎస్ ఎస్ థమన్ గురించి ప్రస్తావిస్తే..

- Advertisement -

ప్రస్తుతం థమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా చాలా బిజీగా ఉన్నాడు. తెలుగుతో పాటు తమిళ.. అప్పుడప్పుడూ హిందీ సినిమాలను చేస్తున్నాడు. ప్రస్తుతం తెలుగులో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ అంటే థమన్ పేరే వినిపిస్తోంది. ఇటీవల వచ్చిన ఓజీ సినిమా సక్సెస్‌ని ఇంకా ఎంజాయ్ చేస్తున్నాడు థమన్. ప్రత్యేకించి పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ సినిమాలకి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదరగొడుతున్నాడని ఇండస్ట్రీలో, అభిమానులు చెప్పుకుంటున్నారు.

Also Read- Vijay – Rashmika: సైలెంట్‌గా విజయ్‌, రష్మిక ఎంగేజ్‌మెంట్‌.. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ఎప్పుడంటే.!

ఈ మ్యూజిక్ సెన్షేషన్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలలో ప్రభాస్, మారుతి కాంబోలో వస్తోన్న ది రాజాసాబ్ ఒకటి. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ఇటీవలే వచ్చి సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది. అయితే, పలు వాయిదాల తర్వాత వచ్చే ఏడాది సంక్రాంతికి ది రాజాసాబ్ రిలీజ్ చేయబోతున్నారు. దీనికోసం జనవరి 9వ తేదీని మేకర్స్ లాక్ చేశారు. అయితే, ఈ డేట్ కి సంగీత దర్శకుడు థమన్ కి ఓ సెంటిమెంట్ ఉంది.

2013లో రామ్ చరణ్, వివి.వినాయక్ కాంబినేషన్ లో వచ్చిన నాయక్ భారీ హిట్ సాధించింది. ఇందులో చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించాడు. ఆకుల శివ అందించిన కథ, ఇందులో కామెడీ పార్ట్ సినిమా సక్సెస్ లో కీలక పాత్రను పోషించాయి. అంతకంటే ఎక్కువ సక్సెస్ క్రెడిట్ ఇవ్వాల్సింది ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన థమన్ కి. 2023 జనవరి 9న నాయక్ వచ్చి సంక్రాంతి రేస్ లో భారీ హిట్ సాధించింది. అలాగే, 2021..జనవరి 9న గోపీచంద్ మలినేని, మాస్ మహారాజ్ రవితేజ కలిసి నటించిన క్రాక్ రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరోసారి థమన్ మ్యూజిక్ అందిస్తున్న ది రాజాసాబ్ కూడా ఇదే జనవరి 9న రావడం ఆసక్తికరం. 2026 జనవరి 9న ప్రభాస్ రాజాసాబ్ మూవీతో వస్తున్నాడు. కాబట్టే ఈ సినిమా కూడా అటు మ్యూజికల్ గా ఇటు సినిమాగా భారీ హిట్ సాధిస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు.

Also Read- Bigg Boss Wild Card: బిగ్ బాస్ లోకి టాప్ కమెడియన్.. వైల్డ్ కార్డ్ ఎంట్రీ సర్వం సిద్ధం..!

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad