SSMB 29: మన టాలీవుడ్ సినీ పరిశ్రమలో అగ్ర దర్శకుడిగా పేరు సాధించుకున్నారు ఎస్ ఎస్ రాజమౌళి. దూరదర్శన్ లో ‘శాంతి నివాసం’ అనే సీరియల్ ద్వారా దర్శకుడిగా కెరియర్ మొదలు పెట్టిన రాజమౌళి.. ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ వన్ సినిమాతో దర్శకుడిగా మారారు. ఈ సినిమాలో హీరోగా ఎన్‌టిర్ నటించారు. రాజమౌళి మొదటి సినిమానే సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమా తర్వాత సింహాద్రి, విక్రమార్కుడు, సై, మగధీర లాంటి సినిమాలు రాజమౌళి నుంచి వచ్చి బాక్సాఫీస్ వద్ద హిట్ సినిమాలుగా నిలిచాయి. ఇక ‘బాహుబలి’ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్ లో దర్శకుడిగా రాజమౌళి పేరు దక్కించుకున్నారు.
బహుబలి తర్వాత ఎన్‌టిర్ – రామ్ చరణ్ లతో రాజమౌళి చేసిన ‘ఆర్ఆర్ఆర్’ గ్లోబల్ రేంజ్ లో పేరు సంపాదించుకున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రస్తుతం మహేష్ బాబుతో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమాను రూపొందిస్తున్నారు. ‘ఎస్ఎస్ఎంబి – 29’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. కానీ, ఈ మూవీకి సంబంధించిన ఏ ఒక్క అప్డేట్ రాజమౌళి ఇప్పటి వరకూ ఇవ్వలేదు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా చిన్న అప్డేట్ ఇచ్చారు. మహేశ్ ని రివీల్ చేయకుండా కేవలం మెడలో ఉన్న ఓ లాకెట్ ని చూపెడుతూ పోస్టర్ ని వదిలారు.
Also Read – Tollywood: అక్టోబర్‌లో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఇవే – ప్రభాస్‌తో రవితేజ బాక్సాఫీస్ ఫైట్
అలా జక్కన్న ఇచ్చిన చిన్న అప్డేట్ నుంచి మళ్ళీ ఇప్పటి వరకూ ఇంకో అప్డేట్ లేదు. అయితే, మహేశ్ ఫ్యాన్స్ మాత్రం ఈ మూవీ అప్డేట్ కోసం ఎదురుచూస్తున్నారు. వారికి, ఈ ఏడాది నవంబర్లో సాలీడ్ అప్డేట్ తో మీ ముందుకు వస్తానని జక్కన్న సర్‌ప్రైజ్ ఇచ్చారు. దీనిలో భాగంగానే ఇప్పుడు ‘ఎస్ఎస్ఎంబి – 29’ సినిమా షూటింగ్ ను జెట్ స్పీడ్ లో కంప్లీట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీని 2025 మార్చి వరకు అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని రాజమౌళి గట్టిగా టార్గెట్ పెట్టుకున్నారట.
అందుకే, షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్, వీఎఫెక్స్ వర్క్ ని సమాంతరంగా పూర్తి చేస్తున్నారు. ఇక మరో షాకింగ్ విషయం ఏమిటంటే మహేశ్ ని పూర్తిగా సినిమా అయ్యే వరకూ ఎక్కడికి వెల్లడానికి వీలు లేదన్నట్టుగా సూచనలిచ్చినట్టు తెలుస్తోంది. మామూలుగా అయితే, మహేశ్ కాస్త గ్యాప్ దొరికినా ఫ్యామిలీతో వెకేషన్ కి విదేశాలకి వెళుతుంటారు. కానీ, రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ని ఆల్రెడీ ఫిక్స్ చేసుకున్నారు కాబట్టి, ఆ టార్గెట్ రీచ్ అయ్యేవరకు ఏ ఒక్కరు రిలాక్స్ అవడానికి వీలు లేదని జక్కన్న గట్టిగా చెప్పారట. చూడాలి మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలను సృష్ఠిస్తుందో.


