Mahesh Babu Rajamouli Movie Update: ట్రిపులార్ తర్వాత దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి నెక్స్ట్ లెవల్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. సూపర్ స్టార్ మహేశ్ బాబు (Mahesh Babu) హీరోగా జక్కన్న తెరకెక్కిస్తున్న భారీ పాన్ వరల్డ్ మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను హైదరాబాద్ (Hyderabad), ఒడిషా, కోరాపుట్ షెడ్యూల్స్‌లో కంప్లీట్ చేశారు. ఈ షెడ్యూల్స్ నుంచి ఇప్పటి వరకూ ఒక్క అప్‌డేట్ కూడా ఇవ్వకుండా రాజమౌళి పక్కాగా ఉన్నారు. జస్ట్ ఓ లీక్ మాత్రమే వచ్చింది. కనీసం షూటింగ్ ప్రారంభమైన ఫుటేజ్ కూడా రివీల్ చేయలేదు.
అయితే, ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు రాజమౌళి టీజర్, ట్రైలర్ లేదా మేకింగ్ వీడియో రిలీజ్ చేసినప్పుడే మొత్తం ఫుటేజ్ ని చూపిస్తారని, అందుకోసమే ఏ చిన్న లీక్ కూడా రాకుండా యూనిట్ సభ్యులంతా జాగ్రత్తపడుతున్నారని చెప్పుకుంటున్నారు. ఆలోచిస్తే, బాహుబలి సిరీస్, ట్రిపులార్ కి కూడా ఇలాగే ప్లాన్ చేశారు. బాహుబలి పార్ట్ 1 మేకింగ్ వీడియోతో ఇచ్చిన అప్‌డేట్ ప్రతీ ఒక్కరినీ ఎంతో థ్రిల్ చేసింది. అలాగే, బాహుబలి 2 మేకింగ్ వీడియో కూడా. ఆ తర్వాత త్రిపులార్ సినిమా విషయంలోనూ జరిగింది.
రామరాజు, భీమ్ ల వీడియోలను ఒక్కొక్కటిగా వదిలి సినిమాపై అసాధారణమైన అంచనాలను పెంచారు జక్కన్న. ట్రైలర్ కట్‌లో చాలా మేకింగ్ షాట్స్‌ని జత చేస్తుంటారు. మేకింగ్ వీడియోలకి రాజమౌళి స్పెషలిస్ట్. గత చిత్రాల మేకింగ్ వీడియోస్ ఇప్పటికీ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంటాయి. అలాగే, ఇప్పుడు సూపర్ స్టార్ మహేశ్ బాబుతో చేస్తున్న SSMB29 మూవీ కోసం కూడా సాలీడ్ ఫీడ్ అంతా సపరేట్ చేస్తున్నారట. ఇదిలా ఉంటే, తాజాగా ఓ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
ALSO READ:https://teluguprabha.net/cinema-news/pawan-kalyan-hari-hara-veera-mallu-ticket-prices-reduced/
రాజమౌళి తన ఫామ్‌హౌస్‌లో SSMB29 మూవీకి సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్‌లో (SSMB 29 Music) బిజీగా ఉన్నారట. సాంగ్స్‌ని ఎలా ప్లాన్ చేయాలి..ఎలాంటి ట్యూన్స్ ఉండాలనే పనిమీద తలమునకలై ఉన్నారట. అంతేకాదు, హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో 100 మందికి పైగా స్టంట్ మేన్లతో భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం రిహార్సల్స్ జరుగుతున్నాయట. సాంగ్స్ కోసం ఎం ఎం కీరవాణి (Keeravani) రికార్డింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. అలాగే, ఆగస్టులో ఆఫ్రికా కూడా వెళ్ళబోతున్నారట. ప్రియాంక చోప్రా, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గ ఆర్ట్స్ పతాకంపై డా.కె.ఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.


