Monday, November 17, 2025
Homeచిత్ర ప్రభSSMB 29 Updates: అదే జరిగితే ప్రపంచంలో రాజమౌళిని ఎవరు టచ్ చేయరు..

SSMB 29 Updates: అదే జరిగితే ప్రపంచంలో రాజమౌళిని ఎవరు టచ్ చేయరు..

Rajamouli Movies: దర్శకధీర రాజమౌళి సినిమాకి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే. ఇప్పుడాయన సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. హైదరాబాద్, ఒడీషాలలో చిత్రీకరణకు జక్కన్న బృందం చిన్న బ్రేక్ ఇచ్చారు. రీసెంట్‌గా ఈ సినిమాలో ఉన్న ఒక పాటకు సంబంధించిన డాన్స్ రిహార్సల్ ని కూడా పూర్తి చేశారు. ఈ గ్యాప్ లో రాజమౌళి ప్రభాస్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా బాహుబలి ది ఎపిక్ కి సంబంధించిన వర్క్ తో బిజీగా ఉన్నారు. అంతేకాదు.. మరో ముఖ్యమైన డీల్ లో కూడా ఆయన చాలా బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

ఆ డీల్ ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే అంటున్నారు ఇండస్ట్రీ వారు. ప్రస్తుతం మహేశ్ బాబుతో చేస్తున్న ఎస్ఎస్ఎంబి సినిమా ప్రొడక్షన్ శ్రీ దుర్గా ఆర్ట్స్ అధినేత డాక్టర్ కెఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ కి బడ్జెట్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకపోయినప్పటికీ.. ఒక కీలకమైన విషయం మీద సీరియస్ గా చర్చలు జరుపుతున్నారట.

Also Read – HariHara Veeramallu Songs : కీరవాణి నిరాశపరిచారా..?

మన దర్శక ధీరుడు ఎంత అద్భుతంగా సినిమా తీసినప్పటికీ, ఆస్కార్ కు నామినేషన్లు వేసినప్పుడు ఫారిన్ సినిమా క్యాటగిరీలోనే అప్లై చేయాల్సి వస్తోంది. దీంతో అవార్డులు వచ్చే సంఖ్య తగ్గిపోతుంది. లేకపోతే.. రాం చరణ్, ఎన్‌టిర్ నటించిన ఆర్ఆర్ఆర్ మూవీకి ఇంకా రెండు, మూడు అవార్డులు వచ్చి ఉండేవి. ఈ కారణంతోనే ఇప్పుడు చేస్తున్న ఎస్ఎస్ఎంబి 29 చిత్రాన్ని ఒక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో కలిసి రూపొందించి నామినేషన్లు వేస్తే అప్పుడు స్ట్రైట్ ఇంగ్లీష్ మూవీగా అర్హత దక్కుతుంది. అలా చేయాలంటే ఓ చిక్కుంది. ఆ వెర్షన్ ని కూడా స్ట్రెయిట్ మూవీగానే షూట్ చేయాలి. అదేమంత ఇబ్బంది కాకపోయినా, కొలాబరేషన్ కోసం ఆసక్తిగా ఉన్న కంపెనీల స్థితిగతులు ఎలా ఉన్నాయో అన్న విషయం మీద ప్రస్తుతం అనాలసిస్ జరుగుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇదే అంశంపై రాజమౌళి బృందం చర్చలు జరుపుతున్నారని సమాచారం. షూటింగ్ కు ముందే కొన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు పార్ట్‌నర్ షిప్ కోసం సంప్రదింపులు జరిపారట. కానీ, రాజమౌళి నిర్ణయం తీసుకునేందుకు ఆలోచిస్తున్నట్టు మీడియా వర్గాలలో చెప్పుకుంటున్నారు. దుర్గా ఆర్ట్స్ బ్యానర్ ని సెకండరీ బ్యానర్ గా మార్చి, మెయిన్ హౌస్ గా హాలీవుడ్ కంపెనీతో టైఅప్ అయితే పలు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్లకు అవకాశం ఉంటుంది. ఈ వ్యవహారం మొత్తం రాజమౌళి కార్తికేయ పరిశీలిస్తున్నారట. కాగా, ఈ సినిమాను 2027 లో విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు రాజమౌళి.

Also Read – Amarnath yatra: అమర్నాథ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత.. ఎందుకంటే?

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad