SSMB29: మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ఎస్ఎస్ఎంబీ 29కు సంబంధించి ఓ క్రేజీ అప్‌డేట్ రివీలైంది. పాన్ వరల్డ్ మూవీగా రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కిస్తోన్నారు. ఇండియన్ లాంగ్వెజెస్‌లో మాత్రమే కాకుండా ప్రపంచ భాషలతో పాటు అనేక దేశాల్లో ఈ మూవీ రిలీజ్ కాబోతుందట. ఈ విషయాన్ని కెన్యా మంత్రి ముసాలియా ముదావాది చెప్పారు. ప్రస్తుతం ఈ ఎస్ఎస్ఎంబీ 29 షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో కీలక సన్నివేశాలను ఈ దేశంలో రాజమౌళి చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో మహేష్‌బాబు, ప్రియాంకచోప్రాతో పాటు ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటున్నారు. షూటింగ్‌తో బిజీగా ఉన్న రాజమౌళి టీమ్ కెన్యా మినిస్టర్ ముసాలియా ముదావాదిని కలిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో కెన్యా మినిస్టర్ పోస్ట్ చేశారు.
Also Read- Ready to Release: ఈ వారం బాక్సాఫీస్ బరిలో నిలిచిన సినిమాలు ఇవే – ఘాటీకి పోటీ ఉంటుందా?
రాజమౌళి సినిమా 120కి పైగా దేశాల్లో రిలీజ్ కాబోతున్నట్లు ఆయన ప్రకటించారు. వంద కోట్ల మందికిపైగా ఈ మూవీ చేరువ అవుతుందని చెప్పారు. ‘కెన్యాలోని మసాయి మరా, నైవాషా, అంబోసెలి వంటి అద్భుతమైన లోకేషన్స్‌లో రాజమౌళి ఈ సినిమాను షూట్ చేస్తున్నారు. ఆసియాలోనే బిగ్గెస్ట్ మూవీగా ఇది ఉండబోతుంది. మొత్తం 120 మందితో కూడిన రాజమౌళి టీమ్ ఈ షెడ్యూల్‌లో పాల్గొంటున్నారు’ అని కెన్యా మినిస్టర్ పోస్ట్‌లో పేర్కొన్నారు. కెన్యా మినిస్టర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దాదాపు రూ. 1200 కోట్ల బడ్జెట్‌తో యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మహేష్‌బాబు కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోంది. బాహుబలి తర్వాత రాజమౌళి కెరీర్‌లో రెండు పార్ట్‌లుగా ఈ మూవీ రూపొందనున్నట్లు చెబుతున్నారు. రాజమౌళి సినిమాతోనే ప్రియాంక చోప్రా తెలుగులోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో పలువురు హాలీవుడ్ నటీనటులు కీలక పాత్రల్లో నటించనున్నట్లు ప్రచారం జరుగుతుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, మాధవన్‌తో పాటు దక్షిణాదికి చెందిన స్టార్స్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.
ఎస్ఎస్ఎంబీ 29 ఫస్ట్ లుక్‌ను నవంబర్‌లో రిలీజ్ చేయబోతున్నట్లు రాజమౌళి ప్రకటించారు. మహేష్‌బాబు బర్త్‌డే సందర్భంగా ఓ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. 2027లో ఈ సినిమా రిలీజయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం.


