Hyper Aadi on HariHara Veeramallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటించిన హరిహర వీరమల్లు ఇవాళ(జూలై 24)న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. దాదాపు రెండేళ్ల తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో..ఈ మూవీపై భారీగానే అంచనాలే ఉన్నాయి. యానిమల్ ఫేమ్ బాబీ డియోల్ ఇందులో విలన్ గా నటించాడు. రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ సినిమాపై ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా ఈ సినిమా ప్రీమియర్ చూసిన హైపర్ ఆది తన రివ్యూను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఆయన ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం.
”హరిహర వీరమల్లు ప్రీమియర్ చూశాను. సినిమా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఇంట్రడక్షన్ సీన్ కు మీరు తెచ్చుకున్న పేపర్స్ అయిపోతాయి. సినిమాలో ఇంకా హై ఇచ్చే సీన్స్ చాలా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ గారు కంపోజ్ చేసిన ఫైట్.. అందుకు కీరవాణి ఇచ్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ అందరికీ గూస్ బంప్స్ తెప్పిస్తాయి. ఆ హైతోనే మీరందరూ థియేటర్ నుంచి బయటకు వస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఫ్యామిలీతో సహా వెళ్లి వీరమల్లు చేసిన పోరాటాన్ని థియేటర్ ఎక్స్పీరియన్స్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా నేను ఈ సినిమా షూటింగ్ అప్పుడు చాలాసార్లు సెట్స్ కు వెళ్లాను. పవన్ కళ్యాణ్ గారు అభిమానులకు నచ్చే సినిమా తీయాలని ప్రతి సీన్ మీద కూడా చాలా కేర్ తీసుకుని చేశారు. ఈరోజు అది స్క్రీన్ మీద కనిపించింది. క్లైమాక్స్ ప్రతి అభిమానిని కదిలించింది. మీరు ఆఫ్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడిన పవన్ కల్యాణ్ గారిని చూశారు..ఇప్పుడు ఆన్ స్క్రీన్ లో ధర్మం కోసం పోరాడిన హరిహర వీరమల్లును చూస్తారు ” అని అన్నారు.
View this post on Instagram
ఈ హిస్టారికల్ సినిమాను దాదాపు 200 కోట్ల బడ్జెట్‌తో ఏఎమ్‌రత్నం నిర్మించారు. క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా దాదాపు మూడేళ్లకు పైగా షూటింగ్‌ను జరుపుకుంది. మొఘల్, గోల్కొండ నవాబుల కాలంలో జరిగిన కొన్ని సంఘటనలకు ఆధారంగా చేసుకుని వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌ను జోడిస్తూ ఈ కథను తీశారు. ఇప్పటికే ప్రీమియర్ షోలు , మార్నింగ్ షోలు చూసిన అభిమానులు సూపర్ హిట్ మూవీ అని ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ బాగుందని, పవన్ ఇంట్రడక్షన్ మైండ్ బ్లోయింగ్ అని, క్లైమాక్స్ పైట్ అయితే ఓ రేంజ్ లో ఉందంటూ తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.


