తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్‌కు(Ajith Kumar) కార్లు, బైక్ రేసింగ్ అంటే ఇష్టం అన్న సంగతి తెలిసిందే. వీలు కుదిరినప్పుడల్లా స్నేహితులతో కలిసి బైక్ ట్రిప్స్‌కు వెళ్తూ ఉంటారు. అలాగే కార్ రేసింగ్‌ల్లో కూడా పాల్గొంటారు. దీంతో ప్రొఫెషనల్ రేసర్‌గా అజిత్‌కు గుర్తింపు వచ్చింది. తాజాగా దుబాయ్ గ్రాండ్ ప్రిక్స్‌లో పాల్గొనేందుకు ఇటీవల అక్కడకు వెళ్లారు. రేస్ ప్రాక్టీస్ చేస్తుండగా అజిత్ నడుపుతున్న కారు గోడను బలంగా ఢీ కొట్టింది. దీంతో కారు ముందు భాగం డ్యామేజ్ అయింది.
అయితే అజిత్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అజిత్‌కు ఏమి కాకపోవడంతో ఆయన అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. జాగ్రత్తగా కారు నడపాలని సూచిస్తున్నారు. కాగా అజిత్, శివ దర్శకత్వంలో నటించిన ‘విదాముయార్చి’ సినిమా సంక్రాంతికి విడుదల కావాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.