ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ హీరోగా తమిళ నటుడు విజయ్ దళపతి రికార్డ్ సృష్టించారు. విజయ్ లేటెస్ట్ మూవీ వారసుడు సినిమా కోసం హీరో విజయ్ ఏకంగా 150 కోట్ల రూపాయల రెమ్యునరేష్ తీసుకోవటం హైలైట్. ఇంకా చెప్పాలంటే వారసుడు సినిమాలో హీరోయిన్ రష్మిక రెమ్యునరేషన్ కంటే హీరో రెమ్యునరేషన్ ఏకంగా 25 రెట్లు ఎక్కువ.
ఓవైపు అజిత్, విజయ్ సినిమాలు రెండూ ఒకేసారి రిలీజ్ అవుతుంటే..ఇద్దరు స్టార్స్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నారు. మరోవైపు.. తన దృష్టిలో ఇద్దరూ బిగ్ స్టార్సే కానీ విజయ్ అజిత్ కంటే బిగ్గర్ స్టార్, కాబట్టే విజయ్ సినిమాకు ఇంకా ఎక్కువ థియేటర్స్ కేటాయించాలంటూ వారసుడు సినిమా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ సంచలనం సృష్టిస్తోంది. బిగ్ స్టార్ఎవరనేది ఎలా తేల్చుతారన్న ప్రశ్నకు దిల్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ అసలు రహస్యాన్ని వివరిస్తోంది. యాక్టర్స్ స్టార్ పవర్ అనేది థియెట్రికల్ రెవిన్యూపై ఆధారపడి ఉంటుందని, విజయ్ సినిమా హిట్టాఫట్టా అన్నవిషయాన్ని పక్కన పెడితే విజయ్ యాక్ట్ చేసిన గత 5-6 సినిమాలు ఏకంగా 60 కోట్లకు పైగా బిజినెస్ చేశాయని..అది కూడా ఒక్క తమిళనాడులోనే కన్సిస్టెంట్ రెవిన్యూ వచ్చిందని దిల్ రాజు వివరించారు. అందుకే విజయ్ ఇప్పుడు అతిపెద్ద స్టార్ అన్న దిల్ రాజు మాటలు అందరినీ ఆలోచింపచేస్తున్నాయి.