Saturday, May 18, 2024
Homeచిత్ర ప్రభHit 2: 'హిట్ 3' కోసం స్టార్ హీరోలు.. ఎవరి వశమవుతుందో?

Hit 2: ‘హిట్ 3’ కోసం స్టార్ హీరోలు.. ఎవరి వశమవుతుందో?

Hit 2: ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ పాన్ ఇండియా సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన సంగతి తెలిసిందే. ఒకవైపు భారీ సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో భారీ కలెక్షన్లను కొల్లగొడుతుంటే.. ఎంగేజ్ స్టోరీలతో కొన్ని చిన్న సినిమాలు కూడా దుమ్మురేపుతున్నాయి. అలా వచ్చి భారీ హిట్ అయిందే ‘హిట్’. నానీ నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన ‘హిట్’ భారీ సక్సెస్ అందుకుంది.

- Advertisement -

కాగా, ఇప్పుడు దీనికి సీక్వెల్ హిట్ 2 కూడా సిద్ధమైంది. త్వరలోనే రిలీజ్ కానున్న ఈ సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి. కాగా.. డైరెక్టర్ శైలేష్ కొలను దీనిని ఓ ప్రాంచైజీగా ప్లాన్ చేసుకోగా.. హిట్ 2 తర్వాత.. హిట్ 3 మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నాడట. అయితే, ఈసారి అడవి శేష్ బదులు మరో స్టార్ హీరోతో పాటు మరికొందరు స్టార్స్ కూడా ఈ సినిమా కోసం ప్లాన్ చేస్తున్నారట. దీనిపై నిర్మాత నానీ దర్శకుడికి ఎప్పుడో ప్రామిస్ చేశాడట.

హిట్ 3 సినిమాలో నానీ లేదా విజయ్ సేతుపతి నటించే ఛాన్స్ ఉండగా.. సీనియర్ హీరోలలో వెంకటేష్, తమిళ హీరో విక్రమ్ అయినా జత కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. అయితే.. ఈ ప్రాంచైజీ ముందుకెళ్లాలంటే ముందుగా రాబోయే హిట్ 2 సినిమా తొలి పార్ట్ లాగానే సూపర్ హిట్ కావాల్సి ఉంటుంది. అప్పుడే నెక్స్ట్ పార్ట్ పై స్టార్ హీరోల కన్ను పడుతుంది. మరి హిట్ 2 రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News