Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభAkhil: స్టార్ హీరోల కొడుకులకు అంత సులువు కాదు!

Akhil: స్టార్ హీరోల కొడుకులకు అంత సులువు కాదు!

STAR KIDS: స్టార్ కిడ్స్‌కు సినిమాలు చేయడం తేలిక. కానీ, ప్రేక్షకులు మెచ్చేలా నిరూపించుకోవడానికి మాత్రం చాలా కష్టం. ఎంత పెద్ద హీరోల కొడుకులైనా, వాళ్ళు ఎంచుకునే కథలు, చేసే నటన బాగుంటునే ప్రేక్షకులు సినిమాని హిట్ చేస్తారు, అలా కాకుండా మాకున్న బ్యాగ్రౌండ్ కి ఏం తీసినా ఏం చేసినా జనాలు చూస్తారు అనుకుంటే, ఎన్ని ఏళ్ళు అయినా వాళ్ళు హిట్ కోసం ఎదురుచూడాల్సిందే.

- Advertisement -

ALSO READ: https://teluguprabha.net/cinema-news/kantara-chapter-1-ott-release/

తమిళంలో విక్రమ్ కొడుకు ధ్రువ్ విక్రమ్ కూడా ఆరేళ్లు కష్టపడ్డాకే విజయం దొరికింది. ధ్రువ్ ఫస్ట్ మూవీ ‘ఆదిత్య వర్మ’ (అర్జున్ రెడ్డి’ రీమేక్) పర్వాలేదనిపించినా, తండ్రితో కలిసి నటించిన ‘మహాన్‌’ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అలా మొదట్లో నిరాశ చెందిన ఇప్పుడు ‘బైసన్’ అనే మంచి సినిమాతో నటుడిగా అతడు గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి నటనకు అందరూ మంచి మార్కులు వేశారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/ravi-teja-mass-jathara-trailer-expectations-drop/

ఇక తెలుగులో నాగార్జున కొడుకు అఖిల్ అక్కినేని పరిస్థితి మరింత కష్టం. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అయినా, అతడు ఇప్పటికీ ఒక పెద్ద హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అతడు చేసిన ‘అఖిల్’, ‘హలో’, ‘మిస్టర్ మజ్ను’, చివరికి ‘ఏజెంట్’ లాంటి సినిమాలు కూడా ఆశించిన విజయాన్ని ఇవ్వలేదు. “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ఓ మోస్తరు విజయం సాధించిన, అది సంతృప్తి కలిగించలేదు. అఖిల్‌లో టాలెంట్ ఉంది, కానీ సరైన టైమ్‌లో మంచి కథ దొరకడం లేదు. ధ్రువ్ ఆలస్యంగానైనా విజయాన్ని అందుకున్నాడు. అఖిల్ కూడా త్వరలోనే ఒక పెద్ద హిట్‌తో తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవాలని అందరూ ఎదురుచూస్తున్నారు. స్టార్ కిడ్ అయినా సరే, ప్రేక్షకులను మెప్పించాలంటే మాత్రం గట్టి పోరాటం చేయాల్సిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad