Star Heroines: సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. హీరోయిన్స్ గ్లామర్ రోల్సే కాదండోయ్..యాక్షన్ రోల్స్‌లోనూ కనిపించటానికి సై అంటున్నారు. ఇలాంటి కథలను హీరోయిన్స్ ఎంపిక చేసుకుంటుండటం వల్ల సినిమాకు ‘హీరో’గా నిలబడాలని ఆశిస్తున్న హీరోయిన్ల మీద ఆడియెన్స్ ఆసక్తి మరింత పెరిగింది. యాక్షన్ బేస్డ్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రాధాన్యత పెరుగుతోంది.
ఒకప్పుడు హీరోల చుట్టూ తిరిగే కథలు ఇప్పుడు హీరోయిన్ల నటన, పాత్ర బలం మీద ఆధారపడి రూపుదిద్దుకుంటున్నాయి. యాక్షన్ సన్నివేశాలలో, బలమైన పాత్రలలో తమ సత్తా చాటడానికి స్టార్ హీరోయిన్లు సిద్ధమవుతున్నారు. ఇది టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు విస్తరిస్తోన్న న్యూ ట్రెండ్. క్రిటిక్స్ దృష్టిలో ఆలియా భట్ (Alia Bhatt) కి ఒక ప్రత్యేకమైన టాలెంట్ ఉంది. స్టార్ హీరోలతో కలిసి నటించినప్పటికీ, ఆమె క్యూట్‌గా కనిపించినా, ఆమెలోని యాక్షన్ యాంగిల్, నటనను ప్రేక్షకులు అంత తేలిగ్గా మర్చిపోలేరు అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఆలియా చేసే సినిమాల ఎంపిక కూడా ఇదే విషయాన్ని క్లియర్ కట్‌గా చెబుతోంది. ఆమె కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, డిఫరెంట్ కథలను ఎంచుకుంటున్నారు.
Also Read- Ramayanam Movie Budget: భారతీయ సినిమాలకు ఇంత బడ్జెట్టా…రిస్క్ తీసుకుంటున్నారా..?
దీపికా పదుకొనె విషయానికి వస్తే వైవిధ్యమైన సినిమాలు చేయటంలో ఆమె కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఏ ప్రాజెక్టుకు సైన్ చేసినా, తన పాత్ర ఎలా ఉండాలి అనే విషయంపై దీపిక గట్టిగా దృష్టి సారిస్తున్నారు. ఆమె ఒక ప్రాజెక్ట్‌కు సంతకం చేసిందంటే, అందులో ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉంటుందనే నమ్మకం ప్రేక్షకులలో ఏర్పడుతోంది. ఇది ఆమె ఎంపికల పట్ల, నటన పట్ల ఆమెకున్న నిబద్ధతకు నిదర్శనం. తెలుగులో కల్కి పార్ట్ వన్‌తో మెప్పించిన దీపిక (Deepika Padukone).. సెకండ్ పార్ట్‌లో నటించాల్సి ఉంది. మరో వైపు అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్‌లో వారియర్ పాత్రలో నటిస్తోంది.
ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్న (Rashmika Mandanna) కూడా సినిమాల ఎంపికలో ఇలాంటి నమ్మకాన్ని క్రియేట్ చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారు. పుష్ప తర్వాత మరోసారి అల్లు అర్జున్‌తో రష్మిక మళ్లీ జోడీ కడుతున్నారనే వార్తలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఈసారి రష్మిక పాత్రకు కాస్త నెగటివ్ టచ్ ఉంటుందని, అంతేకాదు, ఆమె డిష్యుమ్ డిష్యూమ్ అంటూ యాక్షన్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని తాజా అప్డేట్. రష్మిక ఈ కొత్త అవతారంలో ఎలా మెప్పిస్తారో చూడాలి.ఈ విషయంలో ఇప్పటికే అగ్రస్థానంలో నిలిచింది సమంత. సమంత ఒక సినిమాను అంగీకరిస్తే, అది ఇక హీరో ఓరియంటెడ్ కథ కాదు, అది కచ్చితంగా ‘షీరో’ సినిమానే అనిజనాలు ఫిక్స్ అయిపోయారు.
Also Read- Meenakshi Chaudhary: టాలీవుడ్ గ్లామర్ క్వీన్..మీనాక్షి చౌదరి గ్లామర్ ట్రీట్!!
మన దేశంలో సమంత, హాలీవుడ్ రేంజ్‌లో ప్రియాంక చోప్రా తమ కెరీర్‌లో తదుపరి స్థాయికి ఎదగడం అంటే, స్క్రీన్ మీద తమకంటూ ఖచ్చితంగా ఏదో ప్రత్యేకత ఉండాలని కోరుకోవడం. వారి పాత్ర ఎంపికలు, నటనతో వారు తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సృష్టించుకుంటున్నారు. సినిమాకు కేవలం గ్లామర్ కోసమే కాకుండా, కథకు వెన్నెముకగా నిలిచే బలమైన, యాక్షన్ పాత్రలను ఎంచుకుంటూ హీరోయిన్లు తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకుంటున్నారు. వీరి రూట్‌లో ఇంకెవరు ప్రయాణం చేస్తారో చూడాలి మరి.


