Su From So OTT : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కుటుంబ గొడవలు హాట్ టాపిక్‌గా మారిన వేళ, మరోవైపు కన్నడ సినిమా సు ఫ్రమ్ సో ఓటీటీలో సందడి చేస్తోంది. 2025 జులై 25న థియేటర్లలో విడుదలైన ఈ చిన్న బడ్జెట్ చిత్రం, ఎలాంటి పెద్ద స్టార్లు, ప్రమోషన్స్ లేకుండా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. రూ. 5 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా రూ. 120 కోట్లకు పైగా వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఛావా, హౌస్ ఫుల్ 5 వంటి భారీ చిత్రాల రికార్డులను బద్దలు కొట్టిన ఈ మూవీ, ఇప్పుడు జీయో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ALSO READ: Vijay-Rashmika: మొత్తానికి ఇప్పుడు కుదిరింది..
జె.పి. తుమినాద్ రచన, దర్శకత్వంలో తెరకెక్కిన సు ఫ్రమ్ సో, కర్ణాటకలోని ఓ తీరప్రాంత గ్రామంలోని హాస్యభరిత కథతో ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో తుమినాద్ హీరోగా నటించగా, రాజ్ బి. శెట్టి నిర్మాతగా వ్యవహరించారు. అశోక్ అనే యువకుడిపై సులోచన అనే దెయ్యం పట్టిందని గ్రామస్తులు నమ్మడం, ఆ తర్వాత జరిగే హాస్యభరిత సంఘటనలు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తాయి. షానిల్ గౌతమ్, సంధ్య అరకెరె, ప్రకాష్ తుమినాద్, మైమ్ రామదాస్ కీలక పాత్రల్లో నటించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా 26 రీరైట్‌ల తర్వాత ఈ స్క్రిప్ట్ రూపొందింది, ఇది సినిమా ప్రత్యేకత.
ఈ చిత్రం కన్నడతో పాటు మలయాళంలో డబ్ అయ్యింది, తెలుగులో కూడా ఆగస్టు 8న విడుదలైంది. కన్నడలో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ సినిమా, తెలుగులో మాత్రం ఆశించిన స్పందన రాకపోయినా, ఓటీటీలో దీనికి మంచి ఆదరణ లభిస్తుందని అంచనా. జీయో హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 5, 2025 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా, హారర్, కామెడీ, సామాజిక సందేశంతో కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.


