Sudheer Babu: ఇది వరకు టాలీవుడ్ హీరోలు ఓ సినిమా తర్వాత మరో మూవీ చేయడానికి కనీసం ఐదారు నెలలు అయినా గ్యాప్ తీసుకొనేవారు. కానీ ఇప్పుడు ఓ మూవీ సెట్స్‌పై ఉండగానే మరో రెండు మూడు సినిమాలను లైన్‌లో పెడుతున్నారు. గ్యాప్ తీసుకోవడానికి ఏ మాత్రం ఇష్టపడటం లేదు. నవ దళపతి సుధీర్‌బాబు హీరోగా నటించిన జటాధర మూవీ నవంబర్ 7న థియేటర్లలోకి రాబోతుంది. సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీతో బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సినిమాలో సుధీర్‌బాబు ఘోస్ట్ హంటర్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. అరుణాచలం టెంపుల్ నేపథ్యానికి ఓ హారర్ ఎలిమెంట్‌ను మిక్స్ చేస్తూ డైరెక్టర్లు అభిషేక్, వెంకట్ కళ్యాణ్ ఈ మూవీని రూపొందించారు.
జటాధర రిలీజ్ కాకముందే సుధీర్‌బాబు మరో సినిమాను అంగీకరించారు. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌తో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని సుధీర్‌బాబు స్వయంగా వెల్లడించాడు. ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా సినిమా రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ లేదా జనవరిలో సుధీర్‌బాబు, రాహుల్ రవీంద్రన్ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుందట.
Also Read- Baahubali The Eternal War Teaser: ఈసారి ఏకంగా దేవేంద్రుడితో అమరేంద్ర బాహుబలి యుద్ధం
సుధీర్‌బాబు జటాధరతో పాటు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ కూడా నవంబర్ 7నే రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాల మధ్య ఈ వారం గట్టి పోటీ నెలకొంది. ఈ కాంపిటీషన్‌లో ఎవరు విజేతగా నిలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది. ది గర్ల్‌ఫ్రెండ్ మూవీతో దాదాపు ఆరేళ్ల తర్వాత మెగాఫోన్ పట్టారు రాహుల్ రవీంద్రన్. ఈ సారి మాత్రం గ్యాప్ లేకుండా ది గర్ల్‌ఫ్రెండ్ రిలీజైన వెంటనే సుధీర్‌బాబు మూవీని సెట్స్‌పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
మరోవైపు సుధీర్‌బాబు హిట్టు అందుకొని చాలా కాలమైంది. జటాధర రిజల్ట్ అతడి కెరీర్‌కు కీలకంగా మారింది. ఎస్ ఎమ్ ఎస్ సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సుధీర్‌బాబు ఇప్పటివరకు హీరోగా ఇరవై సినిమాలు చేశాడు. ప్రేమకథా చిత్రమ్, సమ్మోహనం, భలే మంచి రోజు మాత్రమే హిట్టయ్యాయి. రిజల్ట్‌లతో సంబంధం లేకుండా డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో సినిమాలు చేస్తున్నాడు. సుధీర్‌బాబు గత సినిమా మా నాన్న సూపర్ హీరో విమర్శకుల ప్రశంసలను అందుకున్నా కమర్షియల్‌గా మాత్రం ఫెయిల్యూర్‌గా నిలిచింది.
Also Read- Raviteja: మెగాస్టార్ డైరెక్టర్‌తో మాస్ మహారాజా మూవీ – రూటు మార్చనున్న రవితేజ?


