Sudheer Babu – Jatadhara Pre Release Event: ‘ఇది నేను సింపతీ కోసం చెప్పలేదు. అలా చేయాలనుకుంటే నా మొదటి సినిమాకే చెప్పేవాడిని’ అని అన్నారు హీరో సుధీర్ బాబు. ఆయనతో పాటు సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే శిల్పా శిరోద్కర్, ఇందిరా కృష్ణ, రవి ప్రకాష్, దివ్య ఖోస్లా, రాజీవ్ కనకాల, శుభలేఖ సుధాకర్, రోహిత్ పాఠక్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు. నవంబర్ 7న తెలుగు, హిందీ భాషల్లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోన్న ఈ సినిమాను జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పిస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకట కళ్యాణ్, అభిషేక్ జైశ్వాల్ దర్శకత్వంలో ఉమేష్ కుమార్ బన్సల్, శివిన్ నారంగ్, అరుణ అగర్వాల్, ప్రేరణ అరోరా, శిల్పా సింగ్‌హల్, నిఖిల్ నందా నిర్మిస్తున్నారు.
‘సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా ‘జటాధర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో సుధీర్ బాబు స్పీచ్ హైలెట్‌గా మారింది. అందులో ఆయన మహేష్, దివంగత సూపర్‌స్టార్ కృష్ణ గురించి తన కెరీర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటం కొసమెరుపు. సుధీర్ బాబు మాట్లాడుతూ ‘‘యాక్టర్ కావాలనే కోరికను ఒకానొక దశలో అణిచి వేయాలని అకున్నాను కానీ కుదరలేదు. సినిమాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నన్ను నేను ‘సుధీర్ బాబు అంటే ఎవరు’ అని ప్రశ్నించుకున్నాను. సినిమా ప్రయత్నాలను ప్రారంభించిన తర్వాత అందరూ కాఫీ ఇచ్చి బాగా మాట్లాడినప్పటికీ చివరకు నో చెప్పేసేవారు. నాకు కృష్ణానగర్ కష్టాలు తెలియకపోవచ్చు. అయితే ఫిల్మ్ నగర్ బాధలేంటో తెలుసు. కారులో కూర్చొని బాధపడటం తెలుసు.
Also Read – Chiranjeevi: మన శంకర వరప్రసాద్‌గారు సెకండ్ సింగిల్ అప్‌డేట్ – రంగంలోకి మరో క్రేజీ సింగర్!
కృష్ణగారి అల్లుడు, మహేష్ బావ అనుకోవటం గర్వంగా ఉంటుంది. కానీ అదొక బాధ్యత. నటుడిగా ఓ సినిమా చేస్తే చాలనుకున్నాను. కానీ 20 సినిమాలు చేశాను. హిట్స్, ఫ్లాప్స్ చూశాను. అన్నింటికీ నేనే బాధ్యుడ్ని. నాపై కూడా విమర్శలు వచ్చాయి. ముందుగా నా వాయిస్ బాగోదు అని అన్నారు. అందువల్ల వాయిస్ కల్చర్‌లో రోజూ గంటపాటు ట్రైనింగ్ తీసుకుంటున్నా. చొక్కా విప్పి.. బాడీ చూపిస్తాడని అన్నారు. అప్పుడు సమ్మోహనం వంటి సినిమా చేశాను. సాఫ్ట్ సినిమాలకే సరిపోతానని అన్నారు.అలాంటప్పుడు వి సినిమాలో నటించాను. అర్బన్ బ్యాక్ మూవీస్‌కే సరిపోతానన్నారు. అప్పుడు శ్రీదేవి సోడా సెంటర్ వంటి మాస్ మూవీలో యాక్ట్ చేశాను. బాలీవుడ్‌కి వెళ్లి విలన్‌గా చేశాను. మన నిర్మాతలు కాఫీ అన్నా ఇచ్చారు. బాలీవుడ్‌కి వెళితే అది కూడా దొరకదేమో అనుకున్నాను. కానీ బాగా చూసుకున్నారు. ఏదైనా పాత్రకు, సినిమాకు రెకమండ్ చేయమని మహేష్‌ను ఎప్పుడూ అడగలేదు. ఏ నిర్మాతను రూపాయి ఎక్కువ అడగలేదు. ఏ దర్శకుడిని పాట కావాలని, ఫైట్ పెట్టమని అడగలేదు. ఎందుకంటే నాకు అవకాశం విలువ తెలుసు’’ అన్నారు.
Also Read – November Movies: నవంబర్‌లో రిలీజ్ కానున్న తెలుగు సినిమాలు ఇవే – రష్మిక, రామ్‌పైనే ఆశలన్నీ!


