Saturday, November 15, 2025
HomeTop StoriesSudheer Babu: సుధీర్ బాబు ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ!

Sudheer Babu: సుధీర్ బాబు ‘జటాధర’ ట్రైలర్ రివ్యూ!

Jatadhara: ట్రైలర్ చూస్తుంటే, ఇది కేవలం హీరో-విలన్ పోరాటం కాదు. ఇది ధర్మానికీ-అధర్మానికీ జరిగే మహా సంగ్రామం అని తెలుస్తుంది. సినిమా ప్రధాన కాన్సెప్ట్ ‘దురాశ వర్సెస్ త్యాగం’ఈ ఫీల్ ట్రైలర్‌లో బలంగా రిజిస్టర్ అయ్యింది.

- Advertisement -

బాలీవుడ్ నుంచి సోనాక్షి సిన్హా విలన్ పాత్రలో తెలుగు ప్రేక్షకులను భయపెట్టడానికి వచ్చేసింది. సోనాక్షి లాంటి స్టార్ హీరోయిన్ ఇలాంటి డీగ్లామర్, పూర్తిగా విలన్ షేడ్స్ ఉన్న పాత్రను ఎంచుకోవడం ఆమె కెరీర్‌లోనే ఒక డేరింగ్ ఛాయిస్, అనే చెప్పాలి.
మొత్తం మీద, సోనాక్షి సిన్హా తన ‘ధన పిశాచిని’ పాత్రతో, తెలుగు ప్రేక్షకులకు ఒక సరికొత్త, విలన్ అవతారాన్ని పరిచయం చేయబోతున్నారు. ఆమె పర్ఫార్మెన్స్, లుక్… ట్రైలర్‌లోనే బిగ్గెస్ట్ టాకింగ్ పాయింట్! జటాధర కథలో ఆమె పాత్ర సృష్టించే అలజడిని తెరపై చూసేందుకు అందరం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/prabhas-double-treat-october-23-and-31/

సుధీర్ బాబు ఒక అద్భుతమైన ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో, అంతకుమించిన ఇంటెన్స్‌తో కనిపించారు.ఫైట్ సీక్వెన్స్‌లలో ఆయన ప్రదర్శించిన కమిట్‌మెంట్, బాడీ లాంగ్వేజ్ మెస్మరైజింగ్‌గా ఉంది. యాక్షన్ సన్నివేశాలు చాలా వైల్డ్‌గా, రాగా డిజైన్ చేశారు. దేవాలయాల నేపథ్యంలో జరిగే ఆ పోరాటాలు అన్నీ హై వోల్టేజ్ ఫైట్స్ అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. సినిమా మేకర్స్ గ్రాండియర్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. ప్రతి ఫ్రేమ్ రిచ్‌గా ఉంది.

విజువల్ ఎఫెక్ట్స్‌పై బాగానే దృష్టి పెట్టారు. కొన్ని షాట్స్ ఇంకాస్త పాలిష్ చేసి ఉంటే బాగుండేది అనిపించినా, ఓవరాల్‌గా ఒక అసాధారణమైన ఫాంటసీ ప్రపంచాన్ని క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు.

చివరిగా చెప్పాలంటే, ‘జటాధర’ ట్రైలర్ ఒక ధైర్యంతో కూడిన ప్రయత్నం. తెలుగు ప్రేక్షకులకు, హార్రర్ ఫాంటసీ లవర్స్‌కి ఇది ఒక ట్రీట్‌లా ఉంటుంది. సుధీర్ బాబు, సోనాక్షి సిన్హా… ఇద్దరూ తమ పాత్రల్లో బాగానే సెట్ అయ్యారు. మరి నవంబర్ 7న రిలీజ్ అవుతున్న ఈ మూవీ ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad