Jatadhara: ఇటీవల కాలంలో మన సౌత్‌లో మాత్రమే కాకుండా, నార్త్ లోనూ మైథలాజికల్ చిత్రాలు ఎక్కువగా రూపొందుతున్నాయి. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన ఆదిపురుష్ ఆశించిన విజయాన్ని అందుకోకపోయినప్పటికీ మైథలాజికల్ మూవీస్ ట్రెండ్ మాత్రం ఊపందుకోవడానికి ప్రధాన కారణం అయింది. ఇటీవల వచ్చిన మహావతార్ నరసింహ యానిమేటేడ్ మూవీగా వచ్చి ఊహించని విజయాన్ని అందుకుంది. ఇక తాజాగా వచ్చిన మిరాయ్ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్‌ని రాబడుతోంది.
ప్రస్తుతం తెలుగులో మరికొన్ని మైథలాజికల్ చిత్రాలు రూపొందుతున్నాయి. హిందీలో రణ్‌బీర్ కపూర్, సాయి పల్లవి సీతారాములుగా రామాయణ రూపొందుతోంది. యష్ ఇందులో రావణ పాత్రలో నటిస్తున్నారు. ఇది రెండు భాగాలుగా రూపొందుతోంది. మొదటి భాగం ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగం 2027 దీపావళికి రిలీజ్ కాబోతున్నాయి. ఈ క్రమంలో సుధీర్ బాబు నటిస్తున్న జటాధర సినిమా నుంచి తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ ని కన్‌ఫర్మ్ చేశారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సూపర్ నేచురల్ సినిమాతో సుధీర్ బాబు మంచి కమ్ బ్యాక్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నారు.
ఇక ఇప్పటి వరకూ పక్కా కమర్షియల్ సినిమాలనే చేసిన సుధీర్ బాబు.. మొదటిసారి చేస్తున్న మైథలాజికల్ మూవీ జటాధర కోసం హార్డ్ వర్క్ బాగా చేస్తున్నారు. డివోషనల్ ఎలిమెంట్స్ తో వస్తున్న జటాధర సినిమాతో హిట్ అందుకోవాలని అన్ని రకాలుగా ట్రై చేస్తున్నారు. ఈ చిత్రాన్ని వెంకటేష్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ డైరెక్ట్ చేస్తున్నారు. జీ స్టూడియోస్, ప్రేరణ అరోరా సమర్పణలో.. ప్రేరణ అరోరా, శివన్ నారంగ్, అరుణ అగర్వాల్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అక్షయ్ క్రేజీవాల్, కుస్సుమ్ అరోరా సహ నిర్మాతలు. ఇక ఈ సినిమా ఇప్పటికే చిత్రీకరణను పూర్తి చేసుకుంది.
కాగా, జటాధర చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని కంప్లీట్ చేస్తున్న మేకర్స్, తాజాగా ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ ఏడాది నవంబర్ 7వ తేదీన జటాధర చిత్రాన్ని వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నట్లుగా మేకర్స్ వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఓ స్పెషల్ వీడియోను కూడా రిలీజ్ చేశారు. దీనికి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ సినిమాను తెలుగు, హిందీ భాషల్లో రూపొందిస్తున్నారు. సుధీర్ బాబు, బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. శిల్పా శిరోద్కర్, రవి ప్రకాష్, ఇంద్ర కృష్ణ, నవీన్ నేని, శుభలేఖ సుధాకర్, రాజీవ్ కనకాల, ఝాన్సీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Also Read- Mirai Movie: బై వన్ గెట్ వన్ ఫ్రీ – రిలీజైన రెండో రోజే ‘మిరాయ్’ మేకర్స్ ఆఫర్


