Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభNTR: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సుహాసినీ క్లారిటీ

NTR: ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై సుహాసినీ క్లారిటీ

Ntr: ప్రతి ఇండస్ట్రీలోను, ప్రతీ రాజకీయ పార్టీలోనూ వారసత్వం అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంటే ఆ పార్టీకి పోటీగా ధీటుగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు. ఈ పార్టీ పెట్టిన కొన్ని నెలల్లోనే ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చారు రామారావు. ఒక వైపు సినిమాలు మరో వైపు పార్టీ వ్యవహారాలతో తలమునలైపోయారు. ఈ నేపథ్యంలో రామారావుకి రాజకీయాలపై అవగాహనా లోపం వల్ల పార్టీకి సంబంధించి చాలా రకాలుగా అవకతవకలు జరిగాయి.

- Advertisement -

ఇక ప్రస్తుతం తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు. అయితే ఈ పార్టీ ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందినదే గానీ, నారా ఫ్యామిలీది కాదు అంటూ పలు వివాదాలు ఎప్పటికప్పుడు రాజుకుంటూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎప్పటికైనా తెలుగుదేశం పార్టీని నడిపించేది, ముందుకు తీసుకు వెళ్ళేది మాన్ ఆఫ్ మాసెస్ గా సినిమా ఇండస్ట్రీలో గ్లోబల్ వైడ్ క్రేజ్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ అని ఆయన అభిమానులు మాట్లాడుతున్నారు. గతంలో ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లో క్రియాశీలకంగా మెలిగారు. 2009 లో ప్రచారం కూడా చేశారు.

అయితే, ఎన్టీఆర్ ప్రచారం చేసిన చోట నాయకులు ఓడిపోయారని నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో అప్పటి నుంచి మళ్ళీ ఎన్టీఆర్ రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కూడా పూర్తిగా తన సినిమాలు తన లైఫ్ తప్ప పొలిటికల్ విషయాల మీద స్పందించడం లేదు. దీంతో ఇక తారక్ రాజకీయాలవైపు రారని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ఎన్టీఆర్ అత్త నందమూరి సుహాసిని ఆయన పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది.

Also Read – Harish Rao:యూరియా కొరతపై కాంగ్రెస్ సర్కారుని ఎండగట్టిన హారీష్‌ రావు!

2018 నుంచి రాజకీయాల్లోనే యాక్టివ్ గా ఉంటున్నాను.. అని చెప్పిన సుహాసినీ జూనియర్ ఎన్టీఆర్ గురించి కూడా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమాల్లో బిజీగా ఉన్నారు.. ఆయన తప్పకుండా పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇస్తారు.. అంటూ తారక్ రాబోయో రోజుల్లో తారక్ పొలిటికల్ జర్నీ గురించి చెప్పారు. ఇక గత కొంతకాలంగా ఏ సభలో చూసినా ఎన్టీఆర్ అభిమానులు ‘సీఎం’ అని అరుస్తున్నారు. ఈ మధ్య అనంతపూర్ ఎమ్మెల్యే, ఎన్టీఆర్ గురించి చేసిన కామెంట్స్ కూడా బాగా వైరల్ అయ్యాయి.

దీంతో ఎన్టీఆర్ అభిమానులంతా భారీ స్థాయిలో ర్యాలీలు కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ కష్ట కాలంలో ఉన్న ప్రతీసారి..తారక్.. నేను ఉన్నాను అంటూ, కార్యకర్తలు అందరికీ భరోసా ఇస్తున్నారు. రాజ్యసభలో కూడా తెలుగులోనే మాట్లాడి, తెలుగు వాళ్లకి గుర్తింపు ఉండాలి అని తెలుగులో అడిగడం అందరికీ ఆశ్చ్ర్యాన్ని కలిగించింది. రామారావు గారికి కొడుకు హరికృష్ణ ఎప్పుడు తోడుగా రథసారధిలా ఉన్నారు. ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అందరికీ..ఈ విధంగా మాట్లాడారు సుహాసినీ. దీంతో ఖచ్చితంగా రానున్న కాలంలో తారక్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని క్లారిటీ వచ్చింది.

Also Read – Samsung Galaxy A17 5G: శామ్‌సంగ్ కొత్త బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ స్మార్ట్ ఫోన్ వచ్చేసింది..ఫీచర్స్ అదుర్స్..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad