Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSujeeth: ఓజీతో 100 కోట్ల దర్శకుడిగా

Sujeeth: ఓజీతో 100 కోట్ల దర్శకుడిగా

Sujeeth: ప్రస్తుతం ‘ఓజీ’ సినిమా పేరు చెప్పగానే చాలామంది ఇది పవన్ కల్యాణ్ సినిమా అంటారు. కానీ, ఇప్పుడు అందరూ కెప్టెన్ ఆఫ్ ది షిప్ సుజీత్ గురించి మాట్లాడుకుంటున్నారు. 11 ఏళ్లుగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నాసరే ఈయన చేసింది కేవలం మూడంటే మూడు సినిమాలు మాత్రమే. మొదటి సినిమా శర్వానంద్ తో చేసిన ‘రన్ రాజా రన్’. ఈ సినిమా చూసే ప్రభాస్ పిలిచి మరీ సాహో చిత్రానికి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. సాహో హాలీవుడ్ స్టైల్లో భారీ విజువల్ వండర్ గా రూపొందించారు సుజీత్. ఫలితం గురించి పక్కన పెడితే ఇండస్ట్రీలో మాత్రం హాట్ టాపిక్ అయ్యారు.

- Advertisement -

మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వచ్చినట్టే వచ్చి మిస్ అయింది. గాడ్ ఫాదర్ సినిమాను సుజీత్ తెరకెక్కించాల్సింది. కానీ, పలు కారణాల వల్ల ఆ సినిమా మోహన్ రాజా చేతికి వెళ్ళింది. దాంతో, అందరూ ఇక సుజీత్ కి మళ్ళీ ఛాన్స్ రావడం చాలా కష్టం అనుకున్నారు. కట్ చేస్తే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్‌ వచ్చింది. అయితే, అప్పుడు కూడా చాలామంది నెగిటివ్ గానే కామెంట్స్ చేశారు. పవన్ లాంటి స్టార్ ని ఢీల్ చేయగల సత్తా సుజీత్ లో ఉందా అని..? సందేహాలను వ్యక్తపరిచారు.

Also Read – Akhanda 2 Release Date : బాలయ్య తాండవం ! అఖండ 2 రిలీజ్ డేట్ వచ్చేసింది

ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం సుజీత్ గురించే మాట్లాడుకుంటుంది. బాహుబలి సినిమాల తర్వాత సలార్ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ కి కావాల్సిన ఫీస్ట్ దొరికింది. అలాగే, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాల తర్వాత మళ్ళీ పవన్ నుంచి వచ్చిన సినిమాలలో ఫ్యాన్స్ కోరుకునే భారీ యాక్షన్ ఎలిమెంట్స్ హరి హర వీరమల్లు సినిమాలో ఉంటాయనుకున్నారు. కానీ, ఈ మూవీ అందరినీ బాగా డిసప్పాయింట్ చేసింది. దాంతో ఫ్యాన్స్ తో పాటుగా ప్రతీ ఒక్కరు ఓజీ రాక కోసమే ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది.

షోలు పడ్డ దగ్గర్నుంచీ ప్రతీ ఒక్కరు మాట్లాడుకుంటుంది దర్శకుడు సుజీత్ గురించే. పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో బాగా రీసెర్చ్ చేసి మరీ కథ, సన్నివేశాలను, ఎలివేషన్స్ ని రాసుకున్నారు. పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగానే ఓజీ చిత్రాన్ని సుజీత్ ఒక దర్శకుడిగా కాకుండా పవన్ అభిమానిగా రూపొందించారని సినిమా చూసిన ప్రతీ ఒక్కరు చెప్పుకుంటున్నారు. ఓజీతో ఒక్కసారిగా 100 కోట్ల దర్శకుడిగా మారాడు సుజీత్. ఇక సుజీత్ ఓజీ క్లైమాక్స్ లో ఇచ్చిన సర్‌ప్రైజ్ మాములూగా లేదు. ఈ సినిమాకి పార్ట్ 2 ఉందని ప్రకటించి అందరికీ షాకిచ్చారు. దీంతో పవన్ అభిమానులే కాదు, ప్రతీ ఒక్కరు ఎంతో ఆతృతగా ఓజీ 2 ఎలా ఉంటుందో మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

Also Read – Minors Rape: బతుకమ్మ ఆడేందుకు వస్తే.. ప్రేమ పేరుతో ముగ్గురు బాలికలపై అత్యాచారం

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad