Sujeeth: ఓజీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. లాంగ్ గ్యాప్ తర్వాత ఈ సినిమాలో వింటేజ్ పవన్ కళ్యాణ్ మళ్లీ కనిపించాడని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ హీరోయిజం, ఎలివేషన్లకు థియేటర్లు మొత్తం దద్దరిల్లిపోతున్నాయి. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే మోస్ట్ స్టైలిష్ యాక్షన్ మూవీ ఇదని అంటున్నారు. ఓజీ డైరెక్టర్ సుజీత్‌పై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. పవన్‌ను ఇంత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా ఇప్పటివరకు ఎవరూ చూపించలేదని అంటున్నారు. సాహో సినిమా రిజల్ట్ విషయంలో తనపై వచ్చిన విమర్శలకు ఓజీతో ఆన్సర్ ఇచ్చారు సుజీత్.
మొన్నటివరకు ఓజీ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులతో ఫుల్ బిజీగా ఉన్నాడు సుజీత్. రిలీజ్ తర్వాత ఓజీకి వస్తోన్న రెస్పాన్స్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఓజీ జర్నీ గురించి పలు ఆసక్తికర విషయాలను మీడియాకు వెళ్లడించాడు సుజీత్.
రామ్‌చరణ్‌తో సినిమా…
సాహో తర్వాత రామ్‌చరణ్‌తో సినిమా చేసే అవకాశం వచ్చిందని సుజీత్ అన్నాడు. లండన్ బ్యాక్‌డ్రాప్‌లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీని రామ్‌చరణ్‌తో చేయాలని అనుకున్నా. స్టోరీ రెడీ అయ్యింది. రామ్‌చరణ్ ఓకే చెప్పారు. కానీ అదే టైమ్‌లో కొవిడ్ రావడంతో ఈ సినిమా వర్కవుట్ కాలేదని అన్నాడు. చిరంజీవితో లూసిఫర్ రీమేక్‌కు దర్శకత్వం వహించే ఛాన్స్ సుజీత్‌కు వచ్చినట్లే వచ్చి చేజారింది.
అకీరాతో…
ఓజీకి సీక్వెల్ రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కాగా ఈ సీక్వెల్‌తో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా నందన్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్స్‌పై కూడా సుజీత్ రియాక్ట్ అయ్యాడు. ఓజీ 2 అకీరానందన్ హీరోగా నటిస్తే హ్యాపీనే. కానీ అకీరా విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది పవన్ కళ్యాణ్. అకీరా గురించి ఆయన్నే అడగాలి. ఓజీ సెట్స్‌కు అకీరా వచ్చాడు. తనలో మంచి స్పార్క్ ఉంది. మల్టీటాలెంటెడ్ అని సుజీత్ అన్నారు.
నానితో కన్ఫామ్…
తన నెక్స్ట్ మూవీని నానితో చేయబోతున్నట్లు కన్ఫామ్ చేశాడు సుజీత్. కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ స్టైల్‌లో డార్క్ హ్యూమర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ ఉండబోతుందని అన్నాడు. తన గత సినిమాలకు భిన్నంగా ఈ మూవీ ఉంటుందని అన్నాడు. నాని, సుజీత్ మూవీని ఓజీ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య నిర్మించబోతున్నారు.
Also Read – Saim Ayub: టీ20ల్లో చెత్త రికార్డును మూటగట్టుకున్న పాకిస్థాన్ స్టార్ బ్యాటర్.. అదేంటో తెలుసా?


