SUJITH: మనం ఒకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా, ఇదే అనుకోవాలి. ‘రన్ రాజా రన్’ సినిమాతో సూపర్ బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ సుజిత్, తర్వాత సినిమా ప్రభాస్‌తో ఓకే చేయించుకుని గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. ఐతే ‘సాహో’ టీజర్ నుంచి ట్రైలర్ వరకూ ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతూనే వచ్చాయి. సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ ‘సాహో’ సినిమాని అంతగా ఆదరించలేదు. అయితే ట్రైలర్ చూసిన షారుక్ ఖాన్ మాత్రం సుజిత్ టాలెంట్‌ని గుర్తించాడు.
RAMCHARAN: అప్పుడు అందరూ సుజిత్ నెక్స్ట్ సినిమా షారుక్‌తోనే అనుకున్నారు. కానీ సుజిత్ ‘సాహో’ తర్వాత కథ చెప్పింది ఎవరికో తెలుసా? రామ్‌చరణ్‌కి. ఆ సినిమా కోసం ఆల్మోస్ట్ వర్క్స్ అన్నీ పూర్తయ్యాయి కూడా. కానీ యూకేలో షూట్ జరగాల్సిన టైమ్‌లో కోవిడ్ మొదలైంది. అలా ఆ సినిమా మొదలు కాకుండానే ఆగిపోయింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/og-movie-first-day-collections-pawan-kalyan-2025/
CHIRU: కానీ సుజిత్‌తో పని చేయాలి అనే కోరిక మాత్రం రామ్‌చరణ్‌తో ఆగిపోలేదు. అలా రామ్‌చరణ్ ప్లేస్‌లో మెగాస్టార్ వచ్చారు. లూసిఫర్ సినిమా రీమేక్ చేయమని ముందుగా సుజిత్‌ని అడిగారట. ఆయన కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యి స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేశారు. కానీ స్క్రిప్ట్ విషయంలో కొన్ని డౌట్స్ రావడంతో, లూసిఫర్ ఒరిజినల్ డైరెక్టర్ పృథ్విరాజ్ సుకుమారన్‌ని కలిసాక, ‘‘సాహో సినిమానే నాకు ఇన్‌స్పిరేషన్ లూసిఫర్ తీయడానికి’’ అని అన్నాడట. దాంతో సుజిత్, ‘‘నేను ఒరిజినల్ సినిమాలు తీయగలను కానీ రీమేక్‌లు తీయలేను’’ అని మెగాస్టార్‌కి చెప్పాడు. అది విన్న మెగాస్టార్ కూడా ఆయన మాటని గౌరవిస్తూ ‘‘సరే’’ అన్నారు.
PK: ఆ తర్వాత త్రివిక్రమ్ పిలుపుతో పవన్ కళ్యాణ్‌కి కథ చెప్పడానికి వెళ్లాడు. కానీ పవన్ మాత్రం ‘‘ఒక రీమేక్ చేద్దాం’’ అని అన్నాడు. ఎందుకంటే టెక్నికల్‌గా సుజిత్ ఎలా తీయగలడో పవన్‌కి, త్రివిక్రమ్‌కి ముందే తెలుసు. కానీ సుజిత్ మాత్రం ఒరిజినల్ స్టోరీనే తీయాలని ఫిక్స్ అయ్యాడు. అలా ఓజీ స్క్రిప్ట్‌తో మళ్లీ పవన్ గారిని కలిశాడు. ఆ స్క్రిప్ట్ నచ్చడంతో ‘ఓజీ’ అనే ఒరిజినల్ సినిమా రూపుదిద్దుకుంది. తాను ఫ్యాన్‌బాయ్‌గా పిలుచుకునే హీరో సినిమా అంటే, ఆ ప్యాషన్ తప్పకుండా ఉంటుంది కదా మరి!
మొత్తానికి మెగా ఫ్యామిలీలో అబ్బాయితో మొదలై బాబాయ్ వరుకు సుజిత్ జర్నీ కొనసాగింది. ఇక ముందు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే ‘ఓజీ’ యూనివర్స్‌లో ఎప్పుడు ఏ కేమియో ఉంటుందో చెప్పలేం కదా.


