Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSukumar: పుష్ప 3 పై అఫీషియల్ గా క్లారిటీ..

Sukumar: పుష్ప 3 పై అఫీషియల్ గా క్లారిటీ..

Sukumar: లెక్కల మాస్టారుగా పేరు తెచ్చుకున్న దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ తో ఆర్య, ఆర్య 2 సినిమాలను చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఆ తర్వాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని వీరిద్దరూ పుష్ప సినిమాతో వచ్చి ఏకంగా పాన్ ఇండియా రికార్డ్స్ ని సృష్ఠించారు. అంతేకాదు, ఈ సినిమాతో అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా దక్కడం గొప్ప విశేషం. ఇక దీని తర్వాత పుష్ప 2 సినిమా చేసి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్ళు రాబట్టిన రెండవ సినిమాగా నిలిచింది.

- Advertisement -

ఆ రకంగా సుకుమార్, అల్లు అర్జున్ సినిమాలకి.. ఈ కాంబినేషన్ కి ఇండస్ట్రీలో మంచి డిమాండ్ ఏర్పడింది. అయితే, పుష్ప 3 ఉంటుందని దర్శకుడు సుకుమార్ పుష్ప 2 క్లైమాక్స్ లోనే ప్రకటించారు. కానీ, ఈ సీక్వెల్ పై మళ్లీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. అయితే, ఇప్పుడు తాజాగా దేవుడి సన్నిధిలో పుష్ప 3 గురించి సుక్కు అప్డేట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

Also Read – Kaleshwaram Case: కాళేశ్వరం కేసు: ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్‌కు హైకోర్టులో ఊరట

ఇటీవల సుకుమార్ కూతురు సుకృతి వేణి నటించిన ‘గాంధీ చెట్టు తాతా’ చిత్రానికి గాను బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నేషనల్ అవార్డును దక్కించుకుంది. ఆ తర్వాత రాజమండ్రిలో ఒక కార్యక్రమానికి హాజరైన సుకుమార్, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన “పుష్ప 3 సినిమా ఖచ్చితంగా ఉంటుంది.. అని వెల్లడించారు. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ‘పెద్ది’ సినిమాతో బిజీగా ఉన్నాను. నా చిత్రాలన్నీ గోదావరి జిల్లాలోనే ఎక్కువగా షూటింగ్ చేస్తున్నాను. గోదావరి జిల్లా వాడిని కావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. రాజమండ్రి అంటే నాకు చాలా ఇష్టం. నేను డైరెక్ట్ చేసిన రంగస్థలం, పుష్ప లాంటి చాలా సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి” అంటూ చెప్పుకొచ్చారు.

దీంతో సుకుమార్ పుష్ప సినిమా పార్ట్ 3 పై అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చినట్టైంది. ప్రస్తుతం అల్లు అర్జున్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తన 22వ సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా కోసమే బన్నీ దాదాపు 2 ఏళ్ళు సమయం కేటాయించారు. సన్ పిక్చర్స్ దాదాపు 600 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పడుకొణె హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక చరణ్ పెద్ది పూర్తైయ్యాక సుక్కుతో ఓ సినిమాను చేయబోతున్నారు. దీని తర్వాత అల్లు అర్జున్ తో పుష్ప 3 ఉంటుందని తెలుస్తోంది.

Also Read – Fasting: ఉపవాసం చేస్తున్నప్పుడు ఈ ఒక్కటి తింటే చాలు..ఆకలి బాధ ఉండదు..

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad