Rajamouli – Sukumar: దర్శకధీరుడు రాజమౌళి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకే కాదు.. ఇప్పుడు పాన్ ఇండియా దాటి పాన్ వరల్డ్ ప్రేక్షకులకు కూడా తెలుసు. ఆయన కాదు, ఆయన సినిమాలే మాట్లాడుతాయి ఆయనేంటో!. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను ఆయన తిరగ రాసిన సంగతి తెలిసిందే. ఓ సినిమాను రెండు భాగాలుగా తీసి బ్లాక్ బస్టర్ సాధించిన డైరెక్టర్‌గా ఇండియాలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు జక్కన్న. ఈయన దారిలో చాలా మంది దర్శకులు ప్రశాంత్ నీల్, సుకుమార్‌లతో పాటు సీనియర్ మోస్ట్ డైరెక్టర్ మణిరత్నం కూడా ట్రావెల్ చేసి సక్సెస్‌లను సొంతం చేసుకున్నారు.
తాజాగా బాహుబలి రెండు పార్టులను ఒకే పార్టుగా మార్చి ‘బాహుబలి ది ఎపిక్’గా మార్చారు ఈ సెన్సేషనల్ డైరెక్టర్. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ సినిమాకు కూడా ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా అదే రేంజ్‌లో జరుగుతోంది. ఇప్పుడు ఇదే బాటలో మరో స్టార్ డైరెక్టర్ అడుగు పెట్టాలనకుంటున్నట్లు సినీ సర్కిల్స్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. సుకుమార్.
Also Read – Naga Durga: తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగదుర్గ కోలీవుడ్ ఎంట్రీ.. స్టార్ హీరో మేనల్లుడి సినిమాలో
రాజమౌళి స్టైల్‌ను ఫాలో అయిన సుకుమార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో పుష్ప సినిమాను మూడు భాగాలుగా ప్లాన్ చేశాడు. పుష్ప ది రైజ్‌తో పాన్ ఇండియా సెన్సేషన్ క్రియేట్ చేస్తే.. పుష్ప 2 ది రూల్‌తో పాన్ వరల్డ్‌లో రికార్డులు క్రియేట్ చేశాడు. పుష్ప 3 సెట్స్ పైకి వెళ్లటానికి చాలా సమయం పట్టేలా ఉంది. సుకుమార్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను రామ్ చరణ్‌తో చేయటానికి రెడీ అవుతున్నాడు. దీనికి కూడా టైమ్ పడుతుంది. ఈ గ్యాప్‌లో సుకుమార్ కూడా పుష్ప రెండు భాగాలను సింగిల్ పార్ట్‌గా చేసి మళ్లీ రీ రిలీజ్ చేయాలనుకుంటున్నాడంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇందులో నిజా నిజాలు తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.
Also Read – CM Revanth Reddy: సినీ కార్మికులపై సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు


