Sukumar : నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 18 పేజెస్ సినిమా డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇటీవలే రిలీజ్ చేసిన ట్రైలర్ చాలా డిఫరెంట్ గా ఉండటంతో ఇప్పట్నుంచే సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే కార్తికేయ 2 సినిమాతో భారీ హిట్ కొట్టిన నిఖిల్ ఈ సినిమాతో కూడా అదే విజయాన్ని కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు.
18 పేజెస్ సినిమా ప్రమోషన్స్ ని వీర లెవల్లో చేస్తున్నారు చిత్ర యూనిట్. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా అల్లు అర్జున్, సుకుమార్ ముఖ్య అతిధులుగా విచ్చేశారు. ఈ ఈవెంట్లో సుకుమార్ మాట్లాడుతూ అనుపమ పరమేశ్వరన్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని తెలిపారు.
సుకుమార్ మాట్లాడుతూ.. రంగస్థలం సినిమాకి మొదట అనుపమ పరమేశ్వరన్ నే హీరోయిన్ గా అనుకున్నాము. ఆడిషన్ కి కూడా పిలిచాము. ఆడిషన్ లో అనుపమ భయపడుతూ మధ్య మధ్యలో వాళ్ళ అమ్మ వైపు చూసింది. దాంతో నాకు భయం వేసింది. ఆ తర్వాత సమంతని తీసుకున్నాము అని తెలిపాడు. దీంతో అనుపమ అభిమానులు మంచి సినిమా మిస్ అయింది మా హీరోయిన్ కి అని బాధపడుతున్నారు.