Ravi Teja: మాస్ మహారాజా రవితేజ, డాన్స్ క్వీన్ శ్రీలీల.. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్ అంటేనే పాటలకి ధమాకా ఖాయం. వీళ్లిద్దరు కలిసి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’ నుంచి తాజాగా ఒక అదిరిపోయే మాస్ సాంగ్ రిలీజ్ అయింది. ‘సూపర్ డూపర్ హిట్ సాంగ్’ అంటూ సాగే ఈ పాట ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/nara-rohit-marriage-date-fixed-with-actress-shirish-october-30/
రవితేజ, శ్రీలీల కాంబో అంటే గతంలో వచ్చిన ‘ధమాకా’ సినిమా గుర్తుకు రావడం సహజం. ఆ సినిమాలో ‘జింతాక్’, ‘పల్సర్ బైక్’ లాంటి పాటలు ఎంత పెద్ద హిట్టయ్యాయో అందరికీ తెలిసిందే. ఆ పాటలకు వచ్చిన రెస్పాన్స్ చూస్తే, ఈ కాంబినేషన్ ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారో అర్ధమవుతుంది. అదే మ్యాజిక్‌ను రిపీట్ చేసేలా ‘మాస్ జాతర’ టీమ్ ప్లాన్ చేసింది. ముఖ్యంగా, ‘ధమాకా’ కు సంగీతం అందించిన భీమ్స్సె
సిరోలియోనే ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందించారు. అందుకే, ఈ కొత్త పాట కూడా మాస్ ఆడియన్స్‌కు పిచ్చిపిచ్చిగా నచ్చేసింది. ‘సూపర్ డూపర్’ పాటలో బీట్స్, ట్యూన్ అన్నీ మాస్ జాతరను తలపించేలా ఉన్నాయి.
ఈ పాటలో రవితేజ వేసిన మాస్ స్టెప్పులు, ఆయన స్వాగ్ ఫ్యాన్స్‌కి బాగా నచ్చేలా ఉంది. మరోవైపు, శ్రీలీల ఎనర్జిటిక్ డ్యాన్స్ కూడా పాటను నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లింది. ఈ సినిమా అక్టోబర్ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే ‘తూ మేరా లవర్’, ‘ఓలే ఓలే’, ‘హుడియో హుడియో’ లాంటి పాటలు విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/venkatesh-role-in-chiranjeevi-manasankar-varaprasad/
‘మాస్ జాతర’ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. పాటలు, టీజర్‌తో ఇప్పటికే అంచనాలు పెంచేసిన ఈ సినిమా.. విడుదలయ్యాక బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ‘మాస్ జాతర’ సృష్టిస్తుందో చూడాలి మరి.


