Coolie Movie Trailer: అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన కూలీ ట్రైలర్ వచ్చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ (RAJINIKANTH) టైటిల్ పాత్రలో నటించిన ఈ సినిమాను లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj)తెరకెక్కిస్తున్నారు. సినిమా ఆగస్ట్ 14న రిలీజ్ కానుంది (Coolie Release date). చెన్నైలో కూలీ మూవీ ఆడియో విడుదల చేసిన మేకర్స్.. ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. సినిమా రిలీజ్ ముందు వచ్చిన గ్లింప్స్ ఓ రేంజ్ హైప్‌ను పెంచితే, ట్రైలర్ ఈ అంచనాలను ఆకాశానికి తీసుకెళ్లిందనే చెప్పాలి.
రజినీకాంత్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ నాగార్జున అక్కినేని విలన్‌గా నటిస్తున్నారు. కమల్ హాసన్, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సత్యరాజ్, సౌబిన్ షాహిర్, శ్రుతి హాసన్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ట్రైలర్‌లో అందరి పాత్రలకు సంబంధించిన పరిచయం చేసిన లోకేష్.. ఆమిర్ పాత్రను మాత్రం సీక్రెట్‌గానే ఉంచాడు. 30 సంవత్సరాల పాటు సీక్రెట్‌గా ఉండే దేవా అనే పాత్ర చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆ పాత్రలో రజినీకాంత్ కనిపించబోతున్నారు. కమల్ పాత్రకు సంబంధించిన డిస్కషన్ కూడా ట్రైలర్ లో చూపించారు. రజినీకాంత్ సినిమా ఎలా ఉండాలని ఆయన అభిమానులు కోరుకున్నారో.. దాన్ని మించేలా కూలీ సినిమాను లోకేష్ తెరకెక్కించారు.
Also Read – Kingdom Collections: రౌడీ స్టార్ స్పీడ్ తగ్గిందా !.. ‘కింగ్డమ్’ 2 డేస్ కలెక్షన్స్
కూలీ సినిమాతో వెయ్యి కోట్ల క్లబ్ లో చేరాలని కోలీవుడ్ ఇండస్ట్రీ ఎదురు చూస్తోంది. ట్రైలర్ చూస్తుంటే ఈ మార్క్‌ను మూవీ ఈజీగానే టచ్ చేస్తుందనిపిస్తోంది. సినిమాలోని భారీ తారాగణం దీనికి మరింత అదనపు బలాన్ని చేకూరుస్తోంది. అనిరుద్ మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎంతో కీలకంగా మారింది.
పాన్ ఇండియన్ స్టార్స్…
యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో పాన్ ఇండియన్ స్టార్స్ ఆమిర్‌ఖాన్, ఉపేంద్ర, నాగార్జునతో పాటు సౌబీన్ షాహిర్, శృతిహాసన్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. నాగార్జున, సౌబీన్ షాహిర్ రోల్స్ నెగెటివ్ షేడ్స్‌లో సాగుతాయని ట్రైలర్ లో తెలుస్తోంది. రజనీకాంత్, లోకేష్ కగనరాజ్ కాంబినేషన్‌లు వస్తున్న ఫస్ట్ మూవీ ఇది. దాదాపు 350 కోట్ల బడ్జెట్‌తో సినిమాను సన్ పిక్చర్స్ రూపొందించినట్లు సినీ సర్కిల్స్ టాక్.
వార్ 2తో పోటీ…
ఈ ఏడాది రిలీజ్ కాబోతున్న పాన్ ఇండియన్ మూవీస్‌లో రజనీకాంత్ కూలీ, ఎన్టీఆర్ వార్ 2 సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇండియాలోని బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ నటించిన ఈ రెండు సినిమాలు ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. కూలీతో పాటు వార్ 2 ఆగస్ట్ 14న రిలీజ్ అవుతున్నాయి. ఈ రెండు సినిమాల బాక్సాఫీస్ క్లాష్ ఇటూ దక్షిణాదిలో పాటు అటు బాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
Also Read – Nidhi Agarwal: శ్రీకాకుళంలో సందడి చేసిన వీరమల్లు ముద్దుగుమ్మ


