Superstar – H.Vinoth: దర్శకుడు హెచ్. వినోధ్ సినిమాలెలా ఉంటాయో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. ఆయన కథ, కథనాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకే, సూపర్ స్టార్ రజిన్నీకాంత్ కూడా ఆయనతో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 70 ప్లస్ లోనూ రజనీ జెట్ స్పీడ్‌తో సినిమాలు చేస్తున్నారు. ఒక సినిమా షూటింగ్ పూర్తవుతుందో లేదో ఇంకో సినిమాను లైన్ లో పెడుతున్నారు.
సూపర్ స్టార్ ఆల్రెడీ కూలీ చిత్రాన్ని కంప్లీట్ చేశారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్ట్ 14న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. కూలీ అలా పూర్తయ్యిందో లేదో బ్లాక్ బస్టర్ సీక్వెల్ ‘జైలర్ 2’ని సెట్స్‌పైకి తీసుకువచ్చారు. 4-5 నెలలుగా ఈ మూవీ షూట్ లోనే ఉన్నారు రజినీ. ఈ సినిమా చిత్రీకరణలో ఉండగానే నెక్స్ట్ ప్రాజెక్ట్ ను లైన్ లో పెట్టనున్నారట. కూలీ, జైలర్ చిత్రాలను యంగ్ డైరెక్టర్స్‌తో చేసిన రజినీకాంత్ తన నెక్ట్స్ మూవీని కూడా యంగ్ డైరెక్టర్‌తోనే చేయబోతున్నారని సమాచారం. ఆ డైరెక్టర్ ఎవరో కాదు.. ‘ఖాకీ’ మూవీతో దర్శకుడుగా హెచ్. వినోధ్ కోలీవుడ్ లో మంచి పాపులారిటీని తెచ్చుకున్నారు. ఈయనతో ఎప్పటొ నుంచో సూపర్ స్టార్ ఓ సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/heroes-following-the-concept-of-vijay-antonys-bichagadu/
ఈ నేపథ్యంలోనే రజనీకాంత్-వినోద్ మధ్య రెండు సార్లు కథా చర్చలు కూడా జరిగాయని తాజా సమాచారం. పోలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో వినోద్ స్టోరీ చెప్పినట్టు తెలుస్తోంది. ది. సీరియస్ రాజకీయ నేపథ్యంలో సాగే సినిమాగా.. రజినీకాంత్ రేంజ్ కి తగ్గట్టు కథ ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని కోలీవుడ్ మీడియాలో వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి. కథ బాగా నచ్చి రజనీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. త్వరలో ఈ కాంబోలో సినిమాపై అధికారికంగా ప్రకటన ఇవ్వబోతున్నారట.
ప్రస్తుతం వినోద్ కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా ‘జన నాయగన్’ అనే పొలిటికల్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. 2026 సంక్రాంతికి భారీ స్థాయిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న సినిమా కాబట్టే విజయ్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఆ సమయానికి జన నాయగన్ అన్ని విధాలా కలిసి వస్తుందని ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమా విడుదల తర్వాత రజనీకాంత్ రెడీ అంటే వినోద్ తన చిత్రాన్ని మొదలు పెడతారట. వినోద్ ఇప్పటి వరకూ సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్. ఈ ట్రాక్ రికార్డ్ చూసే రజినీ వినోద్ సినిమాకు ఓకే చెప్పారు. మరి అఫీషియల్ కన్‌ఫర్మేషన్ ఎప్పుడు వస్తుందో చూడాలి.