Wednesday, January 8, 2025
Homeచిత్ర ప్రభMohan Babu: మోహన్ బాబు బెయిల్‌ పిటిషన్‌.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

Mohan Babu: మోహన్ బాబు బెయిల్‌ పిటిషన్‌.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో సినీ నటుడు మోహన్ బాబు(Mohan Babu)పై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో తనను పోలీసులు అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ కొట్టివేసింది. దీంతో ఆయన సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించారు. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

- Advertisement -

తన వయసు 72 ఏళ్లని.. గుండె సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నానని పిటిషన్‌లో పేర్కొన్నారు. అందుచేత తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ సుధాంశు దులియా, జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాల బెంచ్ విచారించింది. అయితే మోహన్ బాబు తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి అందుబాటులో లేకపోవడంతో విచారణపై పాస్ ఓవర్ కోరారు. ఇందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు విచారణను వచ్చే గురువారానికి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News