Sunday, November 16, 2025
HomeTop StoriesSurender Reddy: ఇద్ద‌రు హీరోల మ‌ధ్య‌లో చిక్కుకున్న సురేంద‌ర్ రెడ్డి!

Surender Reddy: ఇద్ద‌రు హీరోల మ‌ధ్య‌లో చిక్కుకున్న సురేంద‌ర్ రెడ్డి!

Surender Reddy: సైరా న‌రసింహారెడ్డి, ఏజెంట్ సినిమాల త‌ర్వాత డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ప‌రిస్థితి ఆగ‌మ్య గోచ‌రంగానే మారింది. రెండు సినిమాలు బాక్సాఫీస్ ద‌గ్గ‌ర బోల్తా ప‌డ‌టంతో ఆయ‌న‌తో సినిమాలు చేయ‌టానికి హీరోలు, నిర్మాత‌లు కూడా ముందుకు రాలేదు. అలాంటి త‌రుణంలో ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో సినిమా చేయ‌టానికి రెడీ అయ్యాడు. రామ్ తాళ్లూరి నిర్మాత‌గా ఎప్పుడో సినిమా అనౌన్స్ అయ్యింది. అయితే మూవీ సెట్స్ పైకి మాత్రం వెళ్ల‌లేదు. ప‌వ‌న్ రాజ‌కీయాల్లో బిజీగా ఉండ‌టం.. అప్ప‌టికే క‌మిట్ అయిన హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు, ఓజీ, ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్‌ల‌ను ఇంకా పూర్తి చేయాల్సి ఉండ‌టం వంటి కార‌ణాల‌తో సురేంద‌ర్ రెడ్డి సినిమా అనౌన్స్‌మెంట్‌తోనే ఆగిపోయింది.

- Advertisement -

అయితే ఇన్నాళ్లకు ప‌వ‌న్ సినిమా చేయ‌టానికి సురేంద‌ర్ రెడ్డికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని స‌మాచారం. రీసెంట్‌గానే ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను మ‌రోసారి డైరెక్ట‌ర్ వెళ్లి ప‌ర్స‌న‌ల్‌గా కూడా క‌లిశాడు. ప్ర‌స్తుతం బిజీగా ఉన్న ప‌వ‌న్ సినిమా చేద్దామ‌ని చెప్ప‌టంతో సురేంద‌ర్ రెడ్డి మ‌ళ్లీ వెయిటింగ్‌లో ప‌డ్డాడు. అయితే అదే స‌మ‌యంలో ఈ డైరెక్ట‌ర్‌కి మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. అదే ర‌వితేజ‌తో సినిమా చేసే అవ‌కాశం. వీరిద్ద‌రి కాంబోలో ఇది వ‌ర‌కు కిక్‌, కిక్ 2 సినిమాలు వ‌చ్చాయి. వీటిలో కిక్ బ్లాక్ బ‌స్ట‌ర్ అయితే కిక్ 2 డిజాస్ట‌ర్ అయ్యింది. ఇప్పుడు మూడోసారి ఈ కాంబోలో సెట్ అయ్యే అవ‌కాశాలున్నాయి.

Also Read- Bigg Boss Written Updates: దొంగతనం తప్పు కాదు.. మాధురి మేడం తీర్పు..!

ఇప్పుడు ర‌వితేజ సిగ్న‌ల్ ఇచ్చాడుగా అని సురేంద్ రెడ్డి వెంట‌నే సినిమాను స్టార్ట్ చేస్తే ప‌వ‌న్‌తో సినిమా చేసే అవ‌కాశాన్ని కోల్పోతాడు. కాబ‌ట్టి.. ప‌వ‌న్ ఏమంటాడోన‌ని వెయిట్ చేస్తున్నాడు. ప‌వ‌ర్‌స్టార్ నుంచి వెంట‌నే చేద్దామ‌నే వార్త వ‌స్తే సినిమా ట్రాక్ ఎక్కేస్తుంది. కొన్నాళ్లు ఆగుదామంటే మాత్రం ఆ గ్యాప్‌లో ర‌వితేజ‌తో సినిమా చేసేయాల‌ని సురేంద‌ర్ రెడ్డి వెయిట్ చేస్తున్నాడు. ఇప్పుడిలా ఈ ఇద్ద‌రి హీరోల మ‌ధ్య సురేంద్ రెడ్డి చిక్కుకున్నాడు. ఇన్నేళ్ల గ్యాప్ త‌ర్వాత మ‌ళ్లీ త‌న సినిమా సిట్యువేష‌న్ ఏంట‌నేది ఇంకా డిసైడ్ కాక‌పోవ‌టం కాస్త ఇబ్బందిక‌ర‌మే అయినా సినీ ఇండ‌స్ట్రీలో ఇలాంటివ‌న్నీ కామ‌న్‌గా జ‌రిగే విష‌యాలే.

సైరా నరసింహా రెడ్ది 2019లో విడుదలైతే.. ఏజెంట్ మూవీ 2023లో వచ్చింది. మంచి క్రేజీ కాంబినేషన్ తోనే వచ్చిన ఈ సినిమాల ఫలితాలు ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా ఏజెంట్ సినిమా రిజల్ట్ మాత్రం సురేందర్ రెడ్డిపై చాలా ప్రభావాన్నే చూపించింది. ఈ సినిమా వచ్చి ఇప్పటికే రెండేళ్లు దాటేసింది. మరిప్పుడు ఈ డైరెక్టర్ నెక్ట్స్ సినిమా ఎవరితో అనేది ఇంకా ప్రశ్నార్ధకంగానే ఉంది. క్లారిటీ కావాలంటే మాత్రం వెయిటింగ్ తప్పదు.

Also Read- Sreeleela: శ్రీలీలా కిరాక్‌ పిక్స్‌ వైరల్‌.. రెడ్‌ డ్రెస్‌లో రచ్చ రేపిన సుందరి

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad