Suriya: టాలీవుడ్ ఇండస్ట్రీలో సెట్స్‌కి ఎంటరైనప్పటి నుంచి వెళ్లే వరకు ఒకే ఎనర్జీతో ఉండే హీరో ఎవరా? అని అడిగితే వచ్చే సమాధానం.. రవితేజ. పలు సందర్భాల్లో ఆయనతో పని చేసిన చాలా మంది దర్శకులు, టెక్నీషియన్స్, కో ఆర్టిస్టులు చెప్పిన ఆన్సర్. ఇప్పుడు మరో హీరో కూడా రవితేజ కూడా ఓపెన్‌గా స్టేజ్‌పై ఇదే విషయంపై అప్రిషియేట్ చేయటం ఆయన అభిమానులకు సంతోషాన్నిచ్చిందే. మాస్ మహారాజాను ఇలా స్టేజ్‌పై అభినందించిన హీరో ఎవరో కాదు.. కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ సూర్య. వివరాల్లోకెళ్తే.. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘మాస్ జాతర’. అక్టోబర్ 31న ప్రీమియర్ షోస్‌తో మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read – Pragya Jaiswal: ప్రగ్యా పరువాల జాతర.. కుర్రకారు విల విల..
హైదరాబాద్‌లో జరిగిన ‘మాస్ జాతర’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూర్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘రవితేజ గారిని ఇప్పుడు ఇలా కలవడం ఫ్యాన్ బాయ్ మూమెంట్‌లా అనిపిస్తోంది. కార్తి, జ్యోతిక ఇక్కడ ఉంటే మేం ఎన్నో మెమోరీస్ గుర్తుకు తెచ్చుకునేవాళ్లం. మేం ఇంట్లో రవితేజ గురించి ఎంతో మాట్లాడుకుంటాం. ఎనర్జీకి నిర్వచనంలా రవితేజ గారు ఉంటారు. ఓ కామన్ మ్యాన్‌గా వచ్చి ఈ స్థాయికి ఎదగడం మామూలు విషయం కాదు. ఆయన పాత్రలకు ప్రాణం పోస్తుంటారు. ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేయడంలో రవితేజ గారికి సొంత శైలి ఉంటుంది. తమిళంలో కూడా రవితేజను ఎంతగానో ప్రేమిస్తుంటారు. రజినీకాంత్ గారు, అమితాబ్ బచ్చన్‌లా ఎన్నో దశాబ్దాల నుంచి రవితేజ గారు ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ‘మాస్ జాతర’ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు. రైటర్ భాను భోగవరపు దర్శకత్వం వహించారు. ధమాకా తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో రాబోతున్న సినిమా ఇది. రైల్వే ఎస్సై పాత్రలో మాస్ రాజా కనిపించబోతున్నారు. నవీన్ చంద్ర ఇందులో ప్రతినాయకుడిగా మెప్పించబోతున్నారు.
Also Read – Gouri G Kishan: అదిరిపోయే హాట్ ట్రీట్ ఇచ్చిన పొట్టి పిల్ల


