Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభSuriya Karuppu Teaser: రుద్రుడై వచ్చే దేవుడు.. యాక్షన్ రోల్‌లో సూర్య

Suriya Karuppu Teaser: రుద్రుడై వచ్చే దేవుడు.. యాక్షన్ రోల్‌లో సూర్య

Karuppu Teaser: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకి తమిళ ఇండస్ట్రీతో పాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథా చిత్రాలను ఎంచుకోవడంలో సూర్య రూటే సపరేట్. కథలో కొత్తదనం ఉంటే ఎలాంటి పాత్రలో కనిపించడానికైనా వెనకాడరు. దీనికోసం ఎలాంటి మేకోవర్ అవ్వాలన్నా ఆలోచించరు. ఇందుకు ఉదాహరణ శివ పుత్రుడు, గజినీ, 24, సెవెంత్ సెన్స్, సింగం సిరీస్, ఆకాశం నీ హద్దురా లాంటి సినిమాలే. క్లాస్, మాస్, యాక్షన్ సహా ఏ జోనర్ అయినా సూర్యకి బాగా సూటవుతుంది.

- Advertisement -

ప్రస్తుతం మన సౌత్‌లో ఉన్న పాన్ ఇండియా స్టార్స్‌లో సూర్య ఒకరు. ఆయన నటించిన గత చిత్రం రెట్రో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇదే కాదు.. అంతకముందు వచ్చిన కంగువ, ఈటీ చిత్రాలు సూర్యకి షాకిచ్చాయి. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ వరుసగా హిట్స్ అందుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటి వరకూ ఈ వెర్సటైల్ హీరోకి సక్సెస్ దక్కలేదు. ప్రస్తుతం ఆయన రెండు సినిమాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి కరుప్పు. తమిళంలో మల్టీ టాలెంటెడ్ గా పేరు తెచ్చుకున్న ఆర్జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు.

Also Read – Tanushree Dutt Viral Video: వేధిస్తున్నారంటూ తనుశ్రీ దత్తా ఆవేదన.. సహాయం కావాలంటూ కన్నీళ్లు!

దాదాపు 19 ఏళ్ల తర్వాత సూర్య-త్రిష కాంబినేషన్ రిపీటవుతోంది. 2005లో వచ్చి హిట్ సాధించిన ‘ఆరు'(6) అనే సినిమాలో సూర్య-త్రిష స్క్రీన్ షేర్ చేసుకున్నారు. మళ్ళీ ఇన్నేళ్ళకి సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేయబోతున్నారు. యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లో తెరకెక్కుతున్న కరుప్పు సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌ ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై, ఎస్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రకాష్‌‌‌‌‌‌‌‌ బాబు, ఎస్‌‌‌‌‌‌‌‌ ఆర్‌‌‌‌‌‌‌‌ ప్రభు నిర్మిస్తున్నారు. ఈరోజు (జూలై 23న) సూర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయనకి విషెస్ చెబుతూ, ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

“కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగిస్తే శాంతించే దేవుడు కాదు.. మనసులో మొక్కుకుని మిరపకాయలు దంచితే రుద్రుడై వచ్చే దేవుడు” అంటూ చెప్పిన డైలాగ్ తో టీజర్ ఎంతో పవర్ ఫుల్ గా మొదలవుతుంది. అలాగే.. లాయర్ గా “నా పేరు సూర్య.. నాకు ఇంకో పేరు..” అంటూ సందడి చేశారు. రక రకాల పాత్రల్లో కనిపించిన సూర్య.. యాక్షన్ సీన్స్ లో తనదైన స్టైల్ ని చూపించారు. ఒక్కో సీన్ లో వింటేజ్ సూర్యని చూపించాడు దర్శకుడు. ఇక తాజాగా వచ్చిన టీజర్ చూస్తే ఇందులో సూర్య రెండు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. మొత్తానికి బర్త్ డే సందర్భంగా సూర్య తన ఫ్యాన్స్‌కి మాంచి ట్రీట్ ఇచ్చారు.

Also Read – Suriya First Salary: హీరో సూర్య క‌ళ్లు చెదిరే ఆస్తులు.. ఫ‌స్ట్ రెమ్యూన‌రేష‌న్ మాత్రం 736 రూపాయ‌లే!

కరుప్పుతో పాటు మన తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితోనూ ఓ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు సూర్య. సితార నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి తెరకెక్కనుంది. జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. సూర్య సరసన మమిత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్, రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. 2026 లో సమ్మర్ కానుకగా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad