Suriya Property Value: కోలీవుడ్‌లో కొత్తదనానికి, వైవిధ్యతకు ప్రాధాన్యతనిచ్చే హీరోల్లో సూర్య ముందుంటాడు. రిజల్ట్ గురించి ఆలోచించకుండా కథలు, పాత్రల పరంగా ప్రయోగాలు చేస్తుంటాడు. ఆ ఆలోచనా విధానమే సూర్యను తమిళంలో టాప్ హీరోగా నిలబెట్టింది. టాలీవుడ్, బాలీవుడ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్‌ను తెచ్చిపెట్టింది.
నలభై కోట్ల రెమ్యూనరేషన్…
కోలీవుడ్‌లో టాప్ హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్న సూర్య ప్రస్తుతం ఒక్కో సినిమాకు 35 నుంచి నలభై కోట్ల మధ్య రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. ఓ వైపు హీరోగా నటిస్తూనే 2డీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పేరుతో బ్యానర్ లాంఛ్ చేసిన సూర్య సినిమాలను నిర్మిస్తున్నాడు. జై భీమ్, ఉరియాండి 2, సూరారై పొట్రుతో పాటు సూర్య ప్రొడ్యూసర్‌గా వచ్చిన పలు సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్స్‌గా నిలిచాయి.
బ్రాండ్ అంబాసిడర్‌గా…
పలు ఇంటర్నేషనల్ బ్రాండ్స్‌కు అంబాసిడర్‌గా సూర్య వ్యవహరిస్తున్నాడు. యాడ్స్ ద్వారా కూడా సూర్య గట్టిగానే సంపాదిస్తున్నట్లు సమాచారం. ఒక్కో యాడ్‌లో నటించినందుకు మూడు నుంచి ఐదు కోట్ల వరకు రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు.
Also Read – BAD NEWS: బ్యాడ్ న్యూస్.. వారికి పెన్షన్లు కట్!
200 కోట్ల ఇళ్లు..
సూర్యకు తమిళనాడుతో పాటు ముంబైలో ఖరీదైన నివాసాలు ఉన్నాయి. చెన్నైలో ఉన్న సూర్య లగ్జరీ హౌస్ వాల్యూ 200 కోట్లకుపైనే ఉంటుందని అంటున్నారు. ముంబాయిలో సముద్రతీరానికి దగ్గరలో 70 కోట్ల విలువైన మ్యాన్షన్‌ను గత ఏడాది సూర్య కొనుగోలు చేశారు.
530 కోట్ల నెట్ వర్త్…
ప్రస్తుతం ఏడాదికి రెండు నుంచి మూడు సినిమాలు చేస్తున్నాడు సూర్య. ఈ సినిమాల ద్వారా రెమ్యూనరేషన్ రూపంలో ప్రతి ఏటా వంద కోట్లకుపైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నాడు సూర్య. మొత్తంగా సూర్య ఆస్తులు 350 కోట్ల వరకు ఉంటాయట. జ్యోతిక నెట్ వర్త్ కూడా తక్కువేం కాదు. 180 కోట్ల పైనే ఉంటుందని సమాచారం. సూర్య, జ్యోతిక ఇద్దరి ఆస్తులు కలిపి 530 కోట్లకుపైనే ఉంటాయని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. సౌత్ ఇండస్ట్రీలోనే రిచెస్ట్ సెలిబ్రిటీ కపుల్‌గా సూర్య, జ్యోతిక కొనసాగుతున్నారు.
ట్రైనీగా…
ప్రస్తుతం కోలీవుడ్‌లో హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోల్లో సూర్య టాప్ ఫైవ్‌లో ఉన్నారు. కానీ సూర్య ఫస్ట్ రెమ్యూనరేషన్ మాత్రం 736 రూపాయలేనట. ఓ గార్మెంట్ ఫ్యాక్టరీలో ట్రైనీగా నెలకు 736 రూపాయల జీతంతో మూడేళ్ల పాటు పనిచేశారు. ఆ తర్వాత సూర్య పనితనం నచ్చి 8000 రూపాయలు చేశారట. చాలా కాలం పాటు గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసిన సూర్య ఆ తర్వాత యాక్టర్ కావాలనే ఆశతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తండ్రి శివకుమార్ అప్పటికి కోలీవుడ్‌లో యాక్టర్‌గా ఫేమస్ అయినా సూర్యకు అవకాశాలు అంత ఈజీగా రాలేదట. కెరీర్ ఆరంభంలో చాలా సినిమాల్లో సెకండ్ హీరోగా కనిపించాడు. ఒక్కో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ స్టార్ హీరోగా ఎదిగాడు.
రెండు సినిమాలు…
ప్రస్తుతం తమిళంలో కరుప్పు సినిమా చేస్తున్నాడు సూర్య. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆర్‌జే బాలాజీ దర్శకత్వం వహిస్తున్నాడు. వెంకీ అట్లూరితో సినిమాతో లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులో స్ట్రెయిట్ మూవీ చేస్తున్నాడు సూర్య. ఇటీవలే ఈ సినిమా లాంఛ్ అయ్యింది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కతున్న ఈ సినిమాలో సూర్యకు జోడీగా మమితా బైజు నటిస్తోంది.


