Suriya: ప్రస్తుతం తెలుగు సినిమాలు పాన్ ఇండియన్ లెవెల్‌లో సత్తా చాటుతున్నాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2తో పాటు పలు సినిమాలు టాలీవుడ్ ఖ్యాతిని ఇంటర్నేషనల్ లెవెల్‌కు తీసుకెళ్లాయి. ఇప్పుడు తెలుగు సినిమా వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసే పరిస్థితి నెలకొంది.
ఈ బ్లాక్‌బస్టర్స్‌తో తెలుగు హీరోలతో పాటు దర్శకులకు మంచి క్రేజ్ ఏర్పడింది. తెలుగు డైరెక్టర్లతో సినిమాలు చేసేందుకు బాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ ఆసక్తిని చూపుతున్నారు. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య.. ప్రస్తుతం తెలుగు దర్శకుడు వెంకీ అట్లూరితో ఓ సినిమా చేస్తున్నాడు. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోన్నట్లు సమాచారం.
Also Read- Chiranjeevi – Dasari : దాసరి కోరిక.. చిరంజీవి తీర్చకపోయినా అల్లు అర్జున్ తీర్చాడు!
వెంకీ అట్లూరి ప్రాజెక్ట్ పూర్తికాకముందే మరో తెలుగు దర్శకుడితో సినిమాకు సూర్య గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సోలో, గీత గోవిందం సినిమాల ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూర్య హీరోగా ఓ మూవీ రూపొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఓ సెన్సిబుల్ స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకున్న పరశురామ్.. ఇటీవలే సూర్యను కలిసి కథను వినిపించినట్లు సమాచారం. పరశురామ్ చెప్పిన పాయింట్ నచ్చడంతో సూర్య ఈ సినిమాకు ఓకే చెప్పినట్లు వార్తలొస్తున్నాయి. అయితే కథలో కొన్ని మార్పులు చెప్పాడట సూర్య. ఆ ఛేంజెస్ చేసే పనిలో పరశురామ్ బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. సూర్య, పరశురామ్ మూవీని టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు నిర్మించబోతున్నట్లు సమాచారం. తెలుగు, తమిళ భాషల్లో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట.
వెంకీ అట్లూరి మూవీ తర్వాత మలయాళ డైరెక్టర్ జీతూ మాధవన్‌తో ఓ మూవీ కమిట్ అయ్యాడు సూర్య. ఈ రెండు సినిమాల తర్వాతే పరశురామ్ మూవీ మొదలయ్యే అవకాశం ఉందని అంటున్నారు. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా షూటింగ్ యాభై శాతం వరకు పూర్తయ్యింది. ఇందులో మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తుంది. రమ్యకృష్ణ, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు.
మరోవైపు గీతగోవిందం, సర్కారువారి పాట సినిమాలతో డైరెక్టర్‌గా పెద్ద విజయాలను అందుకున్నాడు పరశురామ్. విజయ్ దేవరకొండతో చేసిన ఫ్యామిలీ స్టార్ డిజాస్టర్ కావడంతో అతడి జోరుకు బ్రేకులు పడ్డాయి. ఓ హిట్టుతో రీ ఎంట్రీ ఇవ్వాలనే గట్టి ప్రయత్నాల్లో ఉన్నాడు.
Also Read- The Girlfriend: రష్మికకు అసలైన పరీక్ష – లేడీ ఓరియెంటెడ్ మూవీతో హిట్టు కొడుతుందా?


