Surya 46: తమిళ సినిమా ఇండస్ట్రీలో సాలీడ్ గా క్రేజ్ ఉన్న హీరో సూర్య. సింగం సిరీస్ తో మన తెలుగు ప్రేక్షకుల్లోనూ విపరీతమైన క్రేజ్ ని సంపాదించుకున్నాడు. అయితే, గత కొతకాలంగా సూర్యకి తమిళంలోనే హిట్ దక్కడం లేదు. కరుప్పు, రెట్రో సినిమాలు ఈ హీరోను బాగా నిరాశపరిచాయి. ప్రస్తుతం తెలుగు డెబ్యూను చేస్తున్న సూర్య, ఈ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఇది ఆయన కెరీర్ లో తెరకెక్కుతోన్న 46వ సినిమా. ఇందులో సూర్యకి జంటగా మలయాళ బ్యూటీ మిమైత బైజు హీరోయిన్‌గా నటిస్తోంది.
తెలుగులో సూర్య చేస్తున్న మొదటి సినిమాను ప్రముఖ నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, ఆయి సౌజన్య కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక, టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. మన టాలీవుడ్ స్టార్స్ కోలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేస్తున్నారు. అదే క్రమంలో మన దర్శకులు అక్కడి హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ఇంతకముందు వంశీ పైడిపల్లి కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో సినిమాను చేసిన సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలలో రిలీజైంది.
Also Read – Puri Sethupathi: అవార్డ్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్
ఇక, మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ కూడా మహానటి నుంచి తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యాడు. సీతారామం, లక్కీ భాస్కర్ లాంటి సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలో సూర్య కూడా తెలుగు ఇండస్ట్రీలో నిలబడాలని తాపత్రయపడుతున్నారు. అలా ఆయన కెరీర్ లో తెరకెక్కుతున్న 46వ సినిమాను ఇక్కడి మేకర్స్ తో చేయడానికి చేతులు కలిపాడు. కాగా, ఈ మూవీ షూటింగ్ గురించి తాజాగా ఓ న్యూస్ తెలిసింది. వెంకీ అట్లూరి, సూర్య అండ్ టీమ్ ప్రస్తుతం యూరప్ లో ఉన్నారు.
అక్కడ బెలారస్‌లో అందమైన లోకేషన్స్‌లో సూర్య పై కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, ఓ సాంగ్ ని కంప్లీట్ చేస్తారట. రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ చిత్రాలు తీసి మెప్పించడంలో వెంకీ అట్లూరికి మంచి పట్టుంది. ఇప్పుడు సూర్యతో చేస్తున్న సినిమా కూడా ఇదే జానర్ లో రూపొందిస్తున్నాడట. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఆల్రెడీ సూర్యకి తెలుగు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది కాబట్టి.. కథ ఏమాత్రం ఆకట్టుకునేలా ఉన్నా గ్యారెంటీగా సూర్య తన డెబ్యూతో టాలీవుడ్ లో మంచి హిట్ కొట్టడం గ్యారెంటీ అని అంటున్నారు. చూడాలి మరి సూర్య 46 కి తెలుగులో ఎలాంటి ఆదరణ దక్కుతుందో.
Also Read – Dude Trailer: డ్యూడ్ ట్రైలర్ టాక్ – అదరగొట్టిన ప్రదీప్ – డీజే టిల్లు బ్యూటీ సర్‌ప్రైజ్


