Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభJr NTR: రామాయ‌ణ కంటే పెద్ద సినిమా.. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మూవీపై ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌!

Jr NTR: రామాయ‌ణ కంటే పెద్ద సినిమా.. ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మూవీపై ప్రొడ్యూస‌ర్ కామెంట్స్‌!

Jr NTR Trivikram Movie: సినిమాల స్పీడును పెంచుతున్నారు టాలీవుడ్ స్టార్స్‌. ఇదివ‌ర‌కు ఓ సినిమా పూర్తిచేసిన త‌ర్వాత మ‌రో మూవీ మొద‌లుపెట్టాల‌నే రూల్ ఫాలో అయ్యేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఓ సినిమా సెట్స్‌పై ఉండ‌గానే మ‌రో రెండు, మూడు సినిమాలు అంగీక‌రిస్తున్నారు. మ‌హేష్‌బాబు (Mahesh Babu) మిన‌హా మిగిలిన హీరోలంద‌రూ లైన‌ప్ గ‌ట్టిగానే ఉంది. నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం వార్ 2 (WAR 2) మూవీతో ప్ర‌శాంత్ నీల్‌తో (Prashanth Neel) పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల‌తో పాటు దేవ‌ర‌2, త్రివిక్ర‌మ్‌తో మ‌రో మూవీ క‌మిట‌య్యాడు.

- Advertisement -

Also Read- Ruhani Sharma: అర్థనగ్న అందాలతో అదరగొట్టిన కోహ్లీ మరదలు..కుర్రాళ్లు చూస్తే తట్టుకోవడం కష్టం..

మైథ‌లాజిక‌ల్ జాన‌ర్‌లో..
త్రివిక్ర‌మ్ మూవీని నిర్మాత సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించ‌బోతున్నారు. హీరోగా ఫ‌స్ట్ టైమ్ ఎన్టీఆర్ ఈ మూవీతో మైథ‌లాజిక‌ల్ జోన‌ర్‌ను ట‌చ్ చేయ‌బోతున్నాడు. బాల‌న‌టుడిగా రామాయ‌ణం చేశారు. హీరోగా మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు పౌరాణిక సినిమా చేయ‌లేదు. త్రివిక్ర‌మ్ మూవీలో ఎన్టీఆర్ లార్డ్ కుమార‌స్వామిగా ఎన్టీఆర్ న‌టించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కుమార‌స్వామి యుద్ద‌దేవుడిగా (గాడ్ ఆఫ్ వార్‌ God Of War) ఎలా అయ్యాడు అనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ రూపొంద‌నున్న‌ట్లు స‌మాచారం.

బిగ్గెస్ట్ పాన్ ఇండియ‌న్ మూవీ…
కాగా కింగ్డ‌మ్ ప్ర‌మోష‌న్స్‌లో ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మూవీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు ప్రొడ్యూస‌ర్ సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ (Suryadevara Naga Vamsi). ఎన్టీఆర్ మూవీకి సంబంధించి ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుంద‌ని చెప్పాడు. బాలీవుడ్ రామాయ‌ణ మించిపోయేలా బిగ్గెస్ట్ ఎవ‌ర్ పాన్ ఇండియ‌న్ మూవీగా ఈ సినిమాను అనౌన్స్ చేస్తామ‌ని నాగ‌వంశీ అన్నాడు. 2026 జూలై త‌ర్వాత ఎన్టీఆర్‌, త్రివిక్ర‌మ్ మూవీ షూటింగ్ మొద‌ల‌య్యే అవ‌కాశం ఉంద‌ని పేర్కొన్నాడు. నాగ‌వంశీ కామెంట్స్ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read- Tollywood: టాలీవుడ్‌లో మైథ‌లాజిక‌ల్ సినిమాల ట్రెండ్ – భ‌క్తి క‌థ‌ల‌పై స్టార్ హీరోల మోజు

వెంక‌టేష్‌తో…
ఎన్టీఆర్ మూవీ కంటే ముందు వెంక‌టేష్‌తో (Venkatesh) ఓ సినిమా చేయ‌బోతున్నాడు త్రివిక్ర‌మ్‌. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వ‌చ్చే నెల నుంచి మొద‌లుకాబోతున్న‌ట్లు స‌మాచారం. ఇందులో వెంకీ సరసన ఇద్దరు హీరోయిన్స్ నటించనున్నారు. దీనికి వెంకటరమణ (Venkata Ramana) అనే టైటిల్ ను కూడా అనుకున్నారని టాక్. మ‌రోవైపు వార్ 2 మూవీతో ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు. హృతిక్ రోష‌న్ మ‌రో హీరోగా న‌టిస్తున్న ఈ స్పై యాక్ష‌న్ మూవీ ఆగ‌స్ట్ 14న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా న‌టిస్తోంది. వార్ 2 రిలీజ్ త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ మూవీ షూటింగ్‌ను తిరిగి మొద‌లు పెట్ట‌నున్నారు ఎన్టీఆర్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad