Sushmita Konidela: భార్య సురేఖకు చిరంజీవి భయపడతారట. ఈ విషయాన్ని చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల స్వయంగా వెల్లడించింది. టాలీవుడ్ హీరోల్లో డ్యాన్సుల్లో బెస్ట్ ఎవరంటే ఇప్పటికీ చిరంజీవి పేరే వినిపిస్తుంది. చిరు స్టెప్పులతోనే సూపర్ హిట్టయిన సినిమాలు చాలానే ఉన్నాయి. చిరు ఐకానిక్ స్టెప్పులకు థియేటర్లో మొత్తం ఊగిపోయేవి. అలాంటి చిరంజీవి… తన భార్య సురేఖను చూసి డ్యాన్సుల్లో తడబడిపోయారట. ఈ విషయాన్ని కిష్కిందపురి ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుస్మిత కొణిదెల వెల్లడించింది .
కిష్కిందపురి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఓ గెస్ట్‌గా సుస్మిత కొణిదెల వచ్చింది. స్టేజ్‌పైకి వచ్చిన సుస్మిత కొణిదెలను అమ్మను చూస్తే మీ నాన్నగారికి చిన్నపాటి భయం ఏదైనా కలుగుతుందా అని సుమ అడిగింది. సుమ ప్రశ్నకు సుస్మిత కొణిదెల చెప్పిన సమాధానం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Also Read – BTSV: గ్రూప్ 1 ను మళ్లీ నిర్వహించండి.. లేనియెడల యుద్ధం తప్పదు!
స్టెప్స్ మర్చిపోయారు…
“ప్రస్తుతం మన శంకర వరప్రసాద్ గారుకు సంబంధించి సాంగ్ షూట్ జరుగుతుంది. ఈ రోజు షూటింగ్ సెట్స్‌కు అమ్మ వచ్చింది. అప్పటివరకు నాన్న బాగా డ్యాన్స్ చేశారు. అమ్మ వచ్చి సెట్స్‌లో కూర్చోగానే నాన్న స్టెప్స్ అటూ ఇటూ అయ్యాయి. కొన్ని స్టెప్స్ మర్చిపోయారు” అని సుస్మిత కొణిదెల అన్నది.
సుస్మిత కొణిదెల కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. ఎంత మెగాస్టార్ అయినా భార్యకు భయపడాల్సిందే అంటూ నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.
ప్రొడ్యూసర్‌గా…
ఖైదీ నంబర్ 150 నుంచి చిరంజీవికి స్టైలిష్ట్‌గా పనిచేస్తోంది సుస్మిత కొణిదెల. అంతే కాకుండా తండ్రితో సినిమా నిర్మించబోతున్నది. మన శంకరవరప్రసాద్‌గారు సినిమాను సాహు గారపాటితో కలిసి సుస్మిత కొణిదెల స్వయంగా ప్రొడ్యూస్ చేస్తోంది.
సంక్రాంతికి రిలీజ్…
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో మరో టాలీవుడ్ అగ్ర హీరో వెంకటేష్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అక్టోబర్‌లో ఈ మూవీ షూటింగ్‌లో వెంకటేష్ భాగం కాబోతున్నారు.
మన శంకరవరప్రసాద్‌గారు మూవీలో నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. చిరంజీవి, నయనతారపై ఓ డ్యూయెట్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు అనిల్ రావిపూడి.
Also Read – Ritu Varma: బెడ్ పై రెచ్చిపోయిన రీతూ వర్మ.. మరి ఇంతలా..


