Saturday, November 15, 2025
Homeచిత్ర ప్రభOG: ఓజీ... సువ్వి సువ్వి సాంగ్‌కు 24 గంట‌ల్లో వ‌చ్చిన వ్యూస్ ఎన్నంటే?.. హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లును...

OG: ఓజీ… సువ్వి సువ్వి సాంగ్‌కు 24 గంట‌ల్లో వ‌చ్చిన వ్యూస్ ఎన్నంటే?.. హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లును బీట్ చేయ‌లేక‌పోయిందిగా!

Pawan Kalyan OG: సెప్టెంబ‌ర్‌లో రిలీజ్ అవుతోన్న తెలుగు సినిమాల్లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఓజీపైనే భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ గ్యాంగ్‌స్ట‌ర్ యాక్ష‌న్ మూవీకి సాహో ఫేమ్ సుజీత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజైన టీజ‌ర్‌తో పాటు సాంగ్స్‌, పోస్ట‌ర్స్ ఓజీ సినిమాపై అభిమానుల్లో ఉన్న ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను రెట్టింపు చేశాయి. .

- Advertisement -

మెలోడీ సాంగ్‌…
వినాయ‌క‌ చ‌వితి సంద‌ర్భంగా ఓజీ మూవీ నుంచి సువ్వి సువ్వి అనే మెలోడీ సాంగ్‌ను మేక‌ర్స్ రిలీజ్ చేశారు. క‌ళ్యాణ్ చ‌క్ర‌వ‌ర్తి త్రిపుర‌నేని రాసిన ఈ రొమాంటిక్ సాంగ్‌ను శృతి రంజ‌ని ఆల‌పించింది. త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. మంచి ల‌వ్ సాంగ్‌గా ఈ పాట మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను మెప్పిస్తోంది. ఈ పాట‌కు ప‌వ‌న్ క‌ళ్యాణ్, ప్రియాంక మోహ‌న్ కెమిస్ట్రీ హైలైట్‌గా నిలుస్తోంది.

Also Read – Ktr: వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు కేటీఆర్‌..

నాలుగు మిలియ‌న్ల వ్యూస్‌…
రిలీజైన ఇర‌వై నాలుగు గంట‌ల్లో సువ్వి సువ్వి సాంగ్ నాలుగు మిలియ‌న్ల వ్యూస్‌ను సొంతం చేసుకున్న‌ది. మేక‌ర్స్ ఊహించిన‌ స్థాయిలో ఈ సాంగ్ ఆద‌ర‌ణ‌ను ద‌క్కించుకోలేక‌పోయింది. ఫ‌స్ట్ సింగిల్ ఫైర్ స్ట్రోమ్‌కు ఇర‌వై నాలుగు గంట‌ల్లో 6.22 మిలియ‌న్ల వ్యూస్ వ‌చ్చాయి. ఫైర్ స్ట్రోమ్ కంటే దాదాపు రెండు మిలియ‌న్లు వ్యూస్ త‌క్కువే సువ్వి సువ్వి పాట‌కు వ‌చ్చాయి.
ప‌వ‌న్ క‌ళ్యాణ్ డిజాస్ట‌ర్ మూవీ హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లులోని అసుర హ‌న‌నం, మాట వినాలి పాట‌లు ఒక్కో రోజులోనే వేర్వేరుగా 19 మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌తో రికార్డులు క్రియేట్ చేశాయి. హ‌రిహ‌ర‌ వీర‌మ‌ల్లు సాంగ్స్‌కు ఓజీ పాట‌లు ఏ మాత్రం పోటీ ఇవ్వ‌లేక‌పోతున్నాయి. ట్యూన్స్ విష‌యంలో ప‌వ‌న్ ఫ్యాన్స్ త‌మ‌న్‌ను తెగ ట్రోల్ చేస్తున్నారు. సువ్వి సువ్వి… సిగ‌రేట్ బ్రేక్ సాంగ్‌లా ఉంద‌ని, త‌మ‌న్‌లో మునుప‌టి జోష్ క‌నిపించ‌డం లేద‌ని విమ‌ర్శిస్తున్నారు.

బాలీవుడ్ హీరో…
ఓజీ మూవీ సెప్టెంబ‌ర్ 25న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహ‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హ‌ష్మీ విల‌న్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో అర్జున్ దాస్‌, శ్రేయారెడ్డి కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై డీవీవీ దాన‌య్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఓజీతో పాటు ప్ర‌స్తుతం ఉస్తాద్‌భ‌గ‌త్‌సింగ్ సినిమా చేస్తున్నాడు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.
హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మిస్తోంది.

Also Read – Mirai Movie : తేజ సజ్జ ‘మిరాయ్’ ట్రైలర్ విడుదల.. సెప్టెంబర్ 12న గ్రాండ్ రిలీజ్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad