S. V. Krishna Reddy New Movie: క్లాస్ చిత్రాల దర్శకుడిగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక పేరు..గుర్తింపు సొంతం చేసుకున్నారు ఎస్వీ కృష్ణారెడ్డి. రచయితగా, సంగీత దర్శకుడుగా కాకుండా నటుడుగానూ మంచి పాపులారిటీ దక్కించుకున్నారు. అంతేకాదు, పలు విభాగాలపై పట్టున్న వ్యక్తిగా కూడా ఎస్వీ కృష్ణారెడ్డి పాపులారిటీని దక్కించుకున్నారు. కే.అచ్చిరెడ్డి తో కలిసి కుటుంబ కథా చిత్రాలను రూపొందించి.. భారీ విజయాలను సొంతం చేసుకున్నారు. యమలీల, మాయలోడు, రాజేంద్రుడు గజేంద్రుడు, ఘటోత్కచుడు సర్దుకుపోదాం రండి వంటి ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్, మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.
ఎస్వీ కృష్ణారెడ్డి 2023లో ‘ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు’ అనే సినిమాను చేశారు. కానీ, ఈ సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి గత చిత్రాల మాదిరిగా సక్సెస్ సాధించలేదు. ఇక ఇన్నేళ్ళ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోబోతున్నారు. తాజాగా ఎస్వీ కృష్ణారెడ్డి మరో చిత్రంను ప్రకటించారు. ‘వేదవ్యాస్’ అనే టైటిల్ తో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలను ఆగస్టు 28న ఘనంగా నిర్వహించారు. ఇక్కడ ఆసక్తి కరమైన విషయం ఒకటుంది. ఈ మూవీ కోసం కొరియన్ అమ్మాయిని హీరోయిన్ గా తీసుకురాబోతున్నారు. అంతేకాదు, ఈ హీరోయిన్ కు రెమ్యునరేషన్ లక్ష డాలర్లు.. అంటే మన ఇండియన్ కరెన్సీలో 86 లక్షల రూపాయలు.. ఇవ్వబోతున్నారట.
Also Read – Sparsh Shrivastava: టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తోన్న మరో బాలీవుడ్ యాక్టర్.. చైతన్యతో పోటీ
ఇక రెమ్యూనరేషన్ తో పాటు షూటింగ్ ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండేందుకు అయ్యే మిగతా ఖర్చులను కూడా భరించబోతున్నారు. దీనికోసం కోసం రూ.35 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం హీరోయిన్ ను కొరియన్ నుంచి ఎంచుకున్న ఎస్వీ కృష్ణారెడ్డి, విలన్ ను మంగోలియా నుంచి ఫైనల్ చేసినట్టు సమాచారం. ఇతనికి లక్షన్నర డాలర్లు అంటే మన ఇండియన్ కరెన్సీలో 1 కోటి 30 లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ గా ఇవ్వబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. తిరుపతి రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా హీరో పేరు గానీ ఇంకా ప్రకటించలేదు.
ఎస్వీ కృష్ణారెడ్డి ఒక జనరేషన్ మొత్తం తన సినిమాలతో ఇంప్రెస్ చేశారు. వినూత్న కథలకు ఆయన పెట్టింది పేరుగా నిలిచారు. కానీ, ఇప్పుడు తెరకెక్కించబోయో సినిమాకి ఇతర ప్రాంతాల నుంచి హీరోయిన్, విలన్లను తీసుకురాబోతున్నట్లు తెలియడంతో ప్రతి ఒక్కరూ షాకవుతున్నారు. ఆయన కెరీర్ లో ఎప్పుడు కూడా పర భాషా నటీనటులను తీసుకున్నది లేదనే చెప్పాలి. మన సౌత్ నుంచే ఆయన సినిమాలలోని పాత్రలకి నటీనటులను ఎంచుకున్నారు. ఆలీ లాంటి కమెడియన్ కి కూడా హీరోను చేసిన ఘనత ఎస్వీ కృష్ణారెడ్డి. చూడాలి మరి ఆయన నుంచు రాబోయో ఈ కొత్త చిత్రం ఎన్ని సంచలనాలు సృష్ఠిస్థుందో.


